Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్: ఐపీఎల్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై- ముగిసిన ఓ శకం

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే ప్రకటించాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశాడు.

తన ఐపీఎల్ ప్రయాణం ముగిసిందని తేల్చి చెప్పాడు. ఇతర లీగ్‌లలో కొనసాగుతానని పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్ ముగియడం.. ఓ కొత్త ప్రయాణానికి నాంది పలికుతుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, నిర్వాహకులు, బీసీసీఐకి ఈ సందర్భంగా అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు.

Ravichandran Ashwin says goodbye to IPL

ఇదివరకే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపిన విషయం తెలిసిందే. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్ నుంచి గతంలోనే తప్పుకొన్నాడు. ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. తాజాగా ఈ లీగ్ నుంచి కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఓ శకం ముగిసినట్టయింది.

రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సందర్భాన్ని ఓ ప్రత్యేకమైన రోజు అభివర్ణించాడు రవిచంద్రన్ అశ్విన్. ఓ సరికొత్త ప్రయాణానికి ఇది ఆరంభం అని వ్యాఖ్యానించాడు. ప్రతి ముగింపునకూ ఓ కొత్త ఆరంభం ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ క్రికెటర్‌గా తన ప్రయాణం నేటితో ముగిసిందని, ఇతర లీగ్‌లలో ఆడటానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.

రిటైర్మెంట్ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, బీసీసీఐకి అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ లీగ్ టోర్నమెంట్ లో కొనసాగుతున్నానని, ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు దీనితో ముడిపడి ఉన్నాయని చెప్పాడు. ఎంతోమంది అభిమానులను ఇచ్చిందని, అందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

2009లో రవి అశ్విన్ ఐపీఎల్ లో అడుగు పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ సీజన్ వరకు మొత్తం 221 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. టీ20 ఫార్మట్ లో తిరుగులేని ఆఫ్-స్పిన్నర్ గా ఆవిర్భవించాడు. ఐపీఎల్ కేరీర్ లో 187 వికెట్లు పడగొట్టాడీ చెన్నై రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. అతని బౌలింగ్ ఎకానమీ రేటు 7.20.

అటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్ రాణించాడు. ఓ అర్ధ సెంచరీతో సహా 833 పరుగులతో సత్తా చాటాడు. 38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్‌లో మొత్తం జట్లకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.

2010, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. 2025 సీజన్‌లో అశ్విన్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడారు. ఈ సీజన్‌లో అతను నిరాశపరిచాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో ఏడు వికెట్లు మాత్రమే తీశాడు.

Story first published: Wednesday, August 27, 2025, 10:58 [IST]
Other articles published on Aug 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+