Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duncan Fletcher advice: కెరీర్లో నేను పొందిన అత్యుత్తమ సలహా ఇదేనని పేర్కొన్న అశ్విన్

Ravichandran Ashwin says former India coach Duncan Fletchers advice has been very helpful in his growth

రవిచంద్రన్ అశ్విన్ మంచి వివేకవంతుడైన క్రికెటర్. అతను ఎల్లప్పుడూ తన క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తన వ్యూహాలను పదును పెట్టుకోవడానికి మార్గాలను అన్వేషించే ప్లేయర్. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే టైంలో టీమిండియా గోల్డెన్ ఫేజ్‌లో ఉంది. 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్లలో అశ్విన్ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే 2014 ఐసీసీ T20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన జట్లలో అశ్విన్ రాణించాడు. ఇక అశ్విన్ టెస్ట్ జట్టులో కీలక స్పిన్నర్ గా మారాడు. అనిల్ కుంబ్లే అనంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్‌గా టీమిండియా టెస్ట్ క్రికెట్‌కు అద్భుతమైన సేవలందించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్‌గా ఎన్నో సార్లు నిలిచాడు.

అశ్విన్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో కపిల్ దేవ్‌ను అధిగమించి.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. దానికి కారణం అతను నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల ఈ ఫీట్ సాధించగలిగాడు. అయితే ఇటీవల అశ్విన్ తన డెవలప్ మెంట్ కోసం తను గుర్తుతెచ్చుకునే అత్యుత్తమ సలహా గురించి తెలిపాడు. మాజీ భారత కోచ్ డంకన్ ఫ్లెచ్చర్ ఇచ్చిన సలహా తనకు ఎంతో మేలు చేసిందని తెలిపాడు.

'నేను ఫ్లెచర్ ను అడిగాను. నేను నన్ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. నా బౌలింగ్, నా ఆట ఎలా మెరుగుపడాలి అంటూ అడిగాను. ఫ్లెచర్ నాకు ఒకటే చెప్పాడు. నువ్వు మెరుగుపడాలంటే నువ్వు మిస్టేక్స్ చేయాలి. ప్రేక్షకుల ముందు నువ్వు విఫలమవ్వాలి. అప్పుడే నీకు తెలుస్తుంది. ఏం చేయాలో. ఏం చేస్తే ఏ తప్పును సవరించుకోవచ్చో.. ఏం చేస్తే మరింత మెరుగ్గా రాణించచ్చో అని చెప్పాడు. ఆ సలహా నాకు నిజంగా బాగా పనిచేసింది. ఎన్నో మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుంటూ నన్నునేను సానపెట్టుకుంటూ ఈ క్రికెట్ జర్నీనీ సాగిస్తున్నాను' అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అశ్విన్ ఆడుతున్నాడు. అతను బ్యాటింగ్‌లో 30కి పైగా సగటుతో 183పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 9కంటే తక్కువ ఎకానమీ రేటుతో 11వికెట్లు తీశాడు. ఇక లీగ్ చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద 40పరుగులు చేసి అశ్విన్ తన జట్టును గెలిపించాడు.

Story first published: Wednesday, May 25, 2022, 17:11 [IST]
Other articles published on May 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+