అశ్విన్ కోచింగ్ అలెర్ట్.. నవ్వులు పూయిస్తున్న రజనీకాంత్ వీడియో!!

చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ పలువురు టీమిండియా క్రికెటర్లు దానిని సరదాగా ఆస్వాదిస్తున్నారు. లాక్‌డౌన్ కాస్త కఠినంగా ఉన్నప్పటికీ చేసేది లేక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కొందరు ఫన్నీ వీడియోలు పోస్టు చేస్తూ అభిమానులను నవ్విస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కడుపుబ్బా నవ్వించే వీడియోలు, మీమ్స్ షేర్ చేస్తున్నాడు. తాజాగా అతడు పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను తెగ నవ్విస్తోంది.

బాంబులతో కాదు.. సాఫ్ట్‌బాల్స్:
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ పోస్టు చేశాడు. 'మీలో అంతర్లీనంగా ఉన్న రజనీకాంత్‌ను బయటకు తీయండి' అంటూ కామెంట్ చేశాడు. వీడియోలో విలన్లు రజనీపై బాంబులు విసురుతుంటారు. వాటిని ఒడుపుగా పట్టుకుని తిరిగి వారిపైకే విసురుతుంటాడు రజనీ. ఆన్‌లైన్ కోచింగ్ అలెర్ట్ అన్న అశ్విన్.. ఇంటి వద్ద అందరూ ఈ ఫీల్డింగ్ డ్రిల్స్‌ను ప్రాక్టీస్ చేయాలని కోరాడు. అయితే చిన్న షరతు కూడా పెట్టాడు. బాంబులతో కాకుండా సాఫ్ట్ బాల్స్‌తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలని సూచించాడు.

ఫ్యాన్స్ ఎంజాయ్:
ఈ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. ఈ తరహా వీడియోలను మరికొన్ని పోస్ట్ చేస్తున్న నెటిజన్లు అదిరే కామెంట్లు చేస్తున్నారు. చూశావా ఇది మా ఆన్‌లైన్ కోచింగ్ అలెర్ట్ అంటూ దీటుగా బదులిస్తున్నారు. ఏది ఏమైనా అశ్విన్ పోస్ట్ చేసిన వీడియో నవ్వులు పూయించడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో కావడంతో మరింత వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్ పాఠాలు:
లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమ అకాడమీల్లో శిక్షణ పొందుతున్న యువ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు క్రికెటర్లు ఆన్‌లైన్ బాట పట్టారు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు. ధోనీ అకాడమీలో యువకులకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లకు ఆన్‌లైన్ ద్వారా ధోనీ సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. క్రికెట్ కోచింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై బోధించాల్సిన అంశాలపై వివరిస్తున్నాడు. అశ్విన్ అకాడమీ కూడా ఇలాంటి కార్యక్రమాలే నిర్వహిస్తున్నది. శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లకు ఆన్ద్వారానే పాఠాలు బోధిస్తున్నది. కొన్నిసార్లు అశ్విన్ స్వయంగా ఆన్‌లైన్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications