ధోనీని ఆకర్షించేందుకు ఎంతో ప్రయత్నించా.. చివరకు..: అశ్విన్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ దృష్టిని ఆకర్షించేందుకు ఎంతో ప్రయత్నించా అని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. తన కెరీర్‌పై ధోనీ ప్రభావం ఎంతగానో ఉందన్నాడు. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌లా అశ్విన్ ఇక్కడ ఉన్నాడని అందరికి తెలిసేలా తనకు చేయాలనుకున్నట్లు అశ్విన్ భావించాడట. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా గత ఏడాది విఫలమైన అశ్విన్.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మారిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది.

సీఎస్‌కే తరఫున ఆడాలని అందరూ కోరుకుంటారు:
తాజాగా ఓ క్రికెట్ వెబ్‌సైట్ నిర్వహించిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఆర్ అశ్విన్ పాల్గొని పలు విషయ్హాలు అభిమానులతో పంచుకున్నాడు. 'ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని అందరూ కోరుకుంటారు. నాకు ఆ అవకాశం మొదటిలోనే వచ్చింది. ఆ సమయంలో నేను గుర్తింపునకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అశ్విన్ ఎవరనేది కెప్టెన్ ఎంఎస్ ధోనీకి తెలియదు. మాథ్యూ హేడేన్, ముత్తయ్య మురళీధరన్ లాంటి స్టార్ ఆటగాళ్లకు కూడా అశ్విన్ ఎవరో తెలియదు. దీంతో మురళీధరన్‌లా అశ్విన్ ఇక్కడ ఉన్నాడని వీళ్లందరికీ తెలిసేలా చేయాలనుకున్నా. ఇది మూర్ఖత్వమా లేక అహంకారమనేది నాకు తెలియదు' అని అశ్విన్ చెప్పాడు.

తొలి సీజన్‌లోనే వాళ్లకు అర్థమైంది:
'ముత్తయ్య మురళీధరన్‌తో పాటు లేదా మురళీధరన్ స్థానంలో ఆడే అవకాశం నాకెవ్వరు ఇవ్వట్లేదు. ఒక్కోసారి నేను క్రికెట్ ఆడగలనా? అని సందేహం వచ్చేది. ఇక ఏదో ఒకరోజు వాళ్ల స్థాయికి చేరుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. సీఎస్‌కే ప్రాక్టీస్ సమయంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హేడన్, జాకోబ్ ఓరమ్, స్టీఫెన్ ఫ్లెమింగ్‌లకు బౌలింగ్ చేయడం ద్వారా తొలుత వాళ్ల మనసు కొల్లగొట్టాను. నా బౌలింగ్ ఎదుర్కోవడం కష్టమేనని ఐపీఎల్ తొలి సీజన్‌లోనే వాళ్లకు అర్థమైంది. దాంతో నాలో కొంత ఆత్మవిశ్వాసం వచ్చింది' అని భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ తెలిపాడు.

ఛాలెంజర్ ట్రోఫీలో ధోనీని ఔట్ చేశా:
'అందరిని పక్కనపెట్టితే.. కెప్టెన్ ఎంఎస్ ధోనీ దృష్టిని మాత్రం ఆకర్షించలేకపోయా. అప్పటివరకుమహీతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. ప్రాక్టీస్ సమయంలో మురళీధరన్ వేసిన బంతులను ధోనీ మైదానం బయటకు బాదేవాడు. మురళీధరన్ కన్నా గొప్పగా బౌలింగ్ చేస్తే.. అతని స్థానంలో నాకు జట్టులో చోటు దక్కుతుందని భావించా. ఛాలెంజర్ ట్రోఫీలో ధోనీని ఔట్ చేయడం ద్వారా ఎట్టకేలకు మిస్టర్ కూల్ దృష్టిని ఆకర్షించా. క్రేజీ కుర్రాడిలా సంబరాలు చేసుకున్నా. ఆ తర్వాత నా బౌలింగ్ మెరుగుపరుచుకుంటూ కీలకంగా మారా. ఒక్కోసారి మొదటి ఓవర్ కూడా వేశా' అని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు.

ఆరు బంతులు స్టేడియం బయటే:
'2008 ఐపీఎల్ సీజన్. చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ, సురేశ్ రైనా బ్యాటింగ్ చేస్తున్నారు. వారికి బౌలింగ్ చేసేందుకు మేమంతా క్యూలో నిలబడ్డాం. మ్యాచ్‌కి వినియోగించే పిచ్ పక్కనే ఆ నెట్ సెషన్ జరుగుతోంది. సెంటర్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి మురళీధరన్ బౌలింగ్ చేసాడు. మురళీ వేసిన ప్రతి బంతిని ధోనీ భారీ షాట్ ఆడి స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆరోజు ఓ ఆరు బంతులు స్టేడియం పైకప్పుని తాకినట్లు ఇంకా గుర్తుంది' అని వెటరన్ స్పీనేర్ చెప్ప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications