Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని చెప్పిన ఆ గొప్ప మాట‌ను గుర్తు చేసుకున్న అశ్విన్‌

Ravichandran Ashwin remembers Dhonis words
Ms Dhoni Golden Advice To Ashwin | Oneindia Telugu

త్వ‌ర‌లో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ దిగ్గ‌జ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోని మాట‌ల‌ను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ క్రీడా చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన అశ్విన్ ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ధోని చెప్పిన ఓ మాట గురించి ప్ర‌స్తావించాడు. జీవితంలో 'మన ప్రయత్నాలను బట్టే ఫలితాలు ఉంటాయి ' అని ధోని ఎప్పుడూ చెప్పేవాడ‌ని తెలిపాడు. అలాగే క్రికెట్‌లో గాయాల కంటే మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండ‌డమే ముఖ్య‌మ‌ని అశ్విన్ చెప్పాడు. అయితే అది చాలా క‌ష్ట‌మైన ప‌ని అన్నాడు. 2019లో తాను ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కు దూర‌మ‌య్యాన‌ని గుర్తు చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో తాను చాలా మాన‌సిక ఆందోళ‌న‌కు గుర‌య్యాన‌ని అశ్విన్ తెలిపాడు.

నిజానికి త‌న జీవితంలో వైఫ్య‌ల్యాల గురించి ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేద‌ని చెప్పాడు. అలాగే మ్యాచ్‌లో వికెట్లు తీయ‌క‌పోయానా పెద్ద‌గా బాధ‌ప‌డ‌లేద‌ని చెప్పాడు. అయితే మ‌న ప్ర‌య‌త్నాల‌ను బ‌ట్టే ఫ‌లితాలు ఉంటాయ‌ని ధోని చెప్పిన మాట‌ను అప్పుడు గుర్తు చేసుకున్న‌ట్లు చెప్పాడు. త‌న ప్ర‌య‌త్నంలో ఎలాంటి లోపం లేద‌ని, తాను గ‌ట్టిగా న‌మ్మిన్న‌ట్లు చెప్పాడు. అందుకే తాను వికెట్లు తీయ‌ని సంద‌ర్భంలో భ‌య‌ప‌డ‌న‌ని చెప్పుకొచ్చాడు. నిజానికి తాను అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో గ్రౌండ్‌లోకి దిగినందుకు చాలా ఆనంద ప‌డాత‌న‌ని తెలిపాడు. ఎందుకంటే అస‌లు చాలా మందికి ఆ అవ‌కాశం కూడా రాద‌ని అశ్విన్ అన్నాడు.

త్వ‌ర‌లో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ దిగ్గ‌జ క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోని మాట‌ల‌ను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ క్రీడా చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన అశ్విన్ ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ధోని చెప్పిన ఓ మాట గురించి ప్ర‌స్తావించాడు. జీవితంలో 'మన ప్రయత్నాలను బట్టే ఫలితాలు ఉంటాయి ' అని ధోని ఎప్పుడూ చెప్పేవాడ‌ని తెలిపాడు. అలాగే క్రికెట్‌లో గాయాల కంటే మాన‌సికంగా ఆరోగ్యంగా ఉండ‌డమే ముఖ్య‌మ‌ని అశ్విన్ చెప్పాడు. తాను ఎక్కువ‌గా ఆలోచిస్తాన‌ని, అది త‌న‌ను మాన‌సికంగా ఆందోళ‌న‌కు గురి చేస్తుంద‌ని తెలిపాడు. మాన‌సికంగా బాధ‌ప‌డి తిరిగి పుంజుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అశ్విన్ తెలిపాడు. కాగా కొంత కాలం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో అశ్విన్ స్థానం కోల్పోయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల మ‌ళ్లీ తిరిగొచ్చి స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న అశ్విన్‌.. సిరీస్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌త ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేక‌పోయినా అశ్విన్ ఈ సారి మాత్రం సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ర‌వీంద్ర జ‌డేజా గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూర‌మ‌వ‌డంతో టీంలో అశ్విన్ స్థానానికి ఢోకా లేదు. భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య టెస్ట్ సిరీస్ ఈ నెల 26 నుంచి సెంచూరియ‌న్ వేదిక‌గా ప్రారంభం కానుంది.

Story first published: Thursday, December 23, 2021, 19:22 [IST]
Other articles published on Dec 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+