డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించలేదు. దీనిపై మండిపడిన మాజీలు.. నెంబర్ వన్ టెస్టు బౌలర్‌ను అలా పక్కన పెడతారా? అని నిలదీశారు. పేస్ పిచ్‌లపై స్పిన్నర్ పనికిరాడని పక్కన పెట్టిన వాళ్లు.. ఒక బ్యాటర్ కూడా అలాగే పేస్ పిచ్‌లపై స్కోరు చేయకపోతే పక్కన పెట్టేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో అశ్విన్ స్పందించాడు.
తను మంచి బ్యాటర్ అయినా కూడా ఆఫ్‌స్పిన్ ఎంచుకన్నానని అశ్విన్ తెలిపాడు. శ్రీలంకతో సిరీసులో భారత బౌలర్లు తడబడ్డారని, సచిన్ చేసే పరుగులన్నీ వాళ్లే ఇచ్చేసేవారని అతను గుర్తుచేసుకున్నాడు. అది చూసినప్పుడే తాను బౌలర్ అవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. కానీ అది రిటైర్ అయినప్పుడు ఈ నిర్ణయం తనను చాలా బాధిస్తుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

'నేను రిటైర్ అయినప్పుడు.. మంచి బ్యాటర్ అయ్యుండీ బౌలింగ్ ఎంచుకున్నందుకు కచ్చితంగా బాధపడతా. అసలు నేను బౌలర్ అవ్వాల్సిన వాడిని కాదు. ఈ ఆలోచనతో ఎప్పుడూ నేను పోరాడుతూనే ఉంటా. కానీ బౌలర్లు, బ్యాటర్లను చూసే విధానంలో కూడా తేడా ఉంటుంది. వాళ్ల ట్రీట్‌మెంట్ కూడా వేరుగానే ఉంటుంది. బ్యాటర్లకు ఇది కేవలం ఒక్క బంతి ఆటే అని నాకు తెలుసు. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వాలని తెలుసు' అని అశ్విన్ అన్నాడు.
'ఒక క్రికెట్ లెజెండ్‌తో దీని గురించి ఒకసారి మాట్లాడా. టెస్టు మ్యాచుల్లో బౌలర్ 40 ఓవర్లు కష్టపడతాడని ఆయన అన్నాడు. అయితే బ్యాటర్ కూడా ఆ మ్యాచ్‌లో కష్టపడతాడు. నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తాడు. అయినా సరే బ్యాటర్‌కు ఎందుకు ఎంపిక చేస్తున్నామో ఆ అర్హతలో మార్పు ఉండదు. చివరకు అది అతనికి ఒక్క బంతి గేమే. అంటే బ్యాటర్లు అలా ఆడకూడదని నేను అనడం లేదు. బౌలర్లు కూడా అలాగే ఆడాలి కదా అంటున్నా' అని అశ్విన్ చెప్పాడు.