కోహ్లి పిలిచిన ఆ క్షణంలో ద్రవిడ్ కళ్లలో కన్నీళ్లు!: అశ్విన్
టీ20 వరల్డ్ కప్ భారత్ విజయం సాధించడంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ది ప్రధాన పాత్ర. ప్రత్యర్థిని ఓడించడానికి అతను మైదానంలో మాత్రమే దిగలేదు. కానీ మిగిలిన పనంతా తెరవెనుక నడిపించిందే ద్రవిడే. ప్రణాళికలు రచించడంలో, జట్టుకూర్పు విషయాల్లో ద్రవిడ్ తీసుకున్న నిర్ణయాలు టీమిండియాను జగజ్జేతగా నిలిపేలా చేశాయి.
2007లో భారత జట్టు సారథి వన్డే ప్రపంచకప్ వేట కోసం రాహుల్ ద్రవిడ్ వెస్టిండీస్‌లో అడుగుపెట్టాడు. కానీ ఆ సమయంలో ఘోర పరాభవం ఎదురైంది. జట్టు నిండా దిగ్గజ క్రికెటర్లు ఉన్నా తొలిరౌండ్‌లోనే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 17 ఏళ్ల తర్వాత ద్రవిడ్ మరోసారి ప్రపంచకప్ కోసం కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టాడు. కానీ ఈ సారి కోచ్‌గా వచ్చాడు. పోగొట్టుకున్న చోటే వెతుకున్నట్లుగా 2007లో ఎదురైన చేదు జ్ణాపకాలు చెరిపేసి, భారత జట్టు చరిత్ర సృష్టించేలా చేశాడు.

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ద్రవిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. సాధారణంగా ద్రవిడ్ ఎమోషన్స్‌ను నియంత్రించుకుంటాడు. కానీ కోచ్‌గా తన ఆఖరి మిషన్‌ను సక్సెస్ చేయడం, ప్లేయర్‌గా సాధ్యం కానీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా ముద్దాడంతో ఉద్వేగాన్ని భయటపెట్టాడు. అయితే ద్రవిడ్ ఎమోషనల్ అవ్వడమే టీ20 వరల్డ్ కప్‌లో బెస్ట్ మూమెంట్ అని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ విజయం గురించి అశ్విన్ స్పందిస్తూ.. ''టీ20 వరల్డ్ కప్‌ను అందుకోమని రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లి పిలిచాడు. అయితే ట్రోఫీని అందుకున్న అనంతరం ద్రవిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఉద్వేగంతో అరుస్తూ ట్రోఫీని హత్తుకొని కన్నీరు పెట్టుకోవడం చూశాడు. టీ20 ప్రపంచకప్‌లో నా వరకు ఇదే బెస్ట్ మూమెంట్'' అని అశ్విన్ పేర్కొన్నాడు.
కాగా, టీ20 వరల్డ్ కప్ విజయానంతరం కోచ్ పదవికి గుడ్‌బై చెప్పిన రాహుల్ ద్రవిడ్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.తాజాగా ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ చర్చలు జరుపుతుంది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకోవాలని కోరింది. మరోవైపు ఆర్‌ఆర్‌లోకి తిరిగి రావడానికి ద్రవిడ్ కూడా సుముఖంగా ఉన్నాడని జాతీయ మీడియా పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications