For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిల్-బుమ్రా కాదు.. టెస్ట్ కెప్టెన్ రేసులోకి మరో పేరు!

Ravichandran Ashwin: రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. భారత జట్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు ముందంజలో ఉన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని, కెప్టెన్సీ బాధ్యతను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించవచ్చని భావిస్తున్నారు. అయితే భారత మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ కోసం ఒక ఆటగాడి పేరును సూచించాడు. అశ్విన్ సూచించిన ఆటగాడి పేరు కూడా ఎప్పుడూ చర్చలోకి రాలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత జట్టులో అత్యంత అనుభవజ్ఞుజైన ఆటగాడిని జట్టుకు కెప్టెన్‌గా చేయాలని అశ్విన్ సూచించాడు.

కొత్త కెప్టెన్ పేరును సూచించిన అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో మాట్లాడుతూ .. టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ గురించి మాట్లాడారు. 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌పై ఇప్పుడు అంత ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదని అశ్విన్ అన్నాడు. రవీంద్ర జడేజాను రెండేళ్ల పాటు కెప్టెన్‌గా చేయవచ్చని ఆయన అన్నారు. "జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు రవీంద్ర జడేజా. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇవ్వాలనుకుంటే జడేజాను రెండేళ్లపాటు కెప్టెన్‌గా చేయండి. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. శుభ్‌మన్ గిల్‌ను రవీంద్ర జడేజాకు డిప్యూటీ అంటే వైస్ కెప్టెన్‌గా చేయవచ్చు" అని అశ్విన్ అన్నాడు.

Ravichandran Ashwin Recommends Ravindra Jadeja as India s Next Test Captain

భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల అని అశ్విన్ అన్నాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా కూడా ఈ పాత్రను సంతోషంగా అంగీకరిస్తాడని చెప్పుకొచ్చాడు. జడేజాను కెప్టెన్ గా చేయమని తాను బలవంతం చేయడం లేదని.. కానీ జడేజాకు కెప్టెన్సీని అప్పగించడంలో ఎటువంటి హాని లేదని అశ్విన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్న రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా గతంలో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. రవీంద్ర జడేజా సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రవీంద్ర జడేజాకు అనుభవానికి లోటు లేదు. రవీంద్ర జడేజా 2012లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అంటే జడేజా భారత్ తరఫున టెస్టుల్లో 13 సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. జడేజా తన బ్యాటింగ్, బౌలింగ్‌తో టీమిండియా అనేక మ్యాచ్‌లను గెలిపించడంలో సహాయపడ్డాడు.

Story first published: Thursday, May 15, 2025, 18:36 [IST]
Other articles published on May 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+