For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌కు ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు: సుందర్‌కు ప్రశంస

టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ 2016-17 సంవత్సరానికి గాను ‘అంతర్జాతీయ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుని అందుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ 2016-17 సంవత్సరానికి గాను 'అంతర్జాతీయ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుని అందుకున్నాడు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ చేతల మీదుగా అశ్విన్‌ ఈ అవార్డు అందుకున్నాడు.

బుధవారం ముంబైలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో సియట్‌ క్రికెట్‌ రేటింగ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డులు-2017 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్ష గోయెంకా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Ravichandran Ashwin receives International Cricketer of the year award

2016-17లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను రవిచంద్రన్‌ అశ్విన్‌ను 'అంతర్జాతీయ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డు వరించింది. హోం సీజన్‌లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో జరిగిన 13 టెస్టుల్లో భారత్ 10 టెస్టుల్లో విజయం సాధించింది.

ఈ విజయాల్లో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. గత 12 నెలల కాలంలో అశ్విన్ 99 వికెట్లు తీశాడు. 10 వికెట్లను ఏడుసార్లు తీయగా, ఐదు వికెట్లను 25 సార్లు తీసి అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 145 వికెట్లు సాధించాడు. 45 టెస్టుల్లోనే 250 వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు.

ఇప్పటివరకు 49 టెస్టులాడిన అశ్విన్‌ 92 ఇన్నింగ్స్‌ల ద్వారా 275 వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా తాను తొలిసారి చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో సునీల్‌ గావస్కర్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్న విషయాన్ని అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో పూణెకు ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్‌ సుందర్‌‌పై కూడా స్పందించాడు.

ఐపీఎల్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకుందని అశ్విన్ అన్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసినట్లు పలువురి తనతో చెప్పినట్లు అశ్విన్ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్‌-19 సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యువ బ్యాట్స్‌మన్‌ షుభమన్‌ గిల్‌కు యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+