For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సమయంలో టీ20ల్లో ధోనీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం: అశ్విన్

Ravichandran Ashwin picks death-overs specialist MS Dhoni as toughest batsman to bowl to in T20S

చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం ఇంటి వద్దే సమయం గడుపుతున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా మ్యాచ్, ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్న ప్లేయ‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. లైవ్ చాట్ సందర్భంగా కొందరు ప్లేయ‌ర్లు అభిమానులతో అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ జాబితాలో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చేరాడు.

 ధోనీకి బౌలింగ్ చేయడం కష్టం:

ధోనీకి బౌలింగ్ చేయడం కష్టం:

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకి అశ్విన్ తాజాగా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని 'టీ20ల్లో డెత్ ఓవర్లలో ఎవరికి బౌలింగ్ చేయాలంటే కష్టం' అని అడగగా.. ధోనీ అని సమాధానం ఇచ్చాడు. 'టీ20 గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ధోనీ ఒకడు. ఆ ఫార్మాట్‌లో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోనీని నిలువరించడం అసాధ్యం. భారత్ ఇప్పటి వరకూ చూడని గొప్ప కెప్టెన్‌ మహీ. అలానే ఐపీఎల్‌లోనూ అదే స్థాయిని అందుకున్నాడు' అని ప్రశంసించాడు.

 సుదీర్ఘకాలం చెన్నైకి:

సుదీర్ఘకాలం చెన్నైకి:

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆర్ అశ్విన్ సుదీర్ఘకాలం టీమిండియా తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు‌కి ఆడాడు. జట్టుకి అవసరమైన సమయాల్లో ధోనీకి అశ్విన్ అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరి మధ్య మంచి కో-ఆర్డినేషన్ ఉండేది. కెప్టెన్‌గా టీంఇండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ చెన్నైకి మూడు టైటిల్స్‌ అందించాడు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం అశ్విన్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది.

ప‌్ర‌తీ క్ష‌ణం క‌ష్ట‌ప‌డుతూ ఉంటా:

ప‌్ర‌తీ క్ష‌ణం క‌ష్ట‌ప‌డుతూ ఉంటా:

ప‌్ర‌తీ క్ష‌ణం మెరుగ‌య్యేందుకు క‌ష్ట‌ప‌డుతూ ఉంటాన‌ని అశ్విన్ పేర్కొన్నాడు.‌ 'గతంలో నేను క‌న‌బ‌ర్చిన ప్ర‌ద‌ర్శ‌న‌ను మెరుగు ప‌రుచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పోరాడుతుంటా. స్వ‌దేశంతో పోల్చుకుంటే విదేశాల్లో అంత‌గా వికెట్లు తీయ‌లేక‌పోవ‌డంపై దృష్టి సారించా. ముఖ్యంగా ఇంగ్లండ్ వంటి పిచ్‌ల‌పై ప్ర‌భావం చూపాల‌ని భావిస్తున్నా. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ల‌క్ష్యాలు పెట్టుకుంటూ ముందుకు సాగుతా. అయితే ఈ క్ర‌మంలో గ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అధిగ‌మించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటా' అని చెప్పాడు.

2010 ఐపీఎల్ సీజ‌న్ ఎన్నో పాఠాలు నేర్పింది:

2010 ఐపీఎల్ సీజ‌న్ ఎన్నో పాఠాలు నేర్పింది:

2010 ఐపీఎల్ సీజ‌న్ త‌న‌కు ఎన్నో పాఠాలు నేర్పింద‌ని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 'ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో క‌న్నా టీ20ల్లో బౌలింగ్ చేయ‌డం చాలా సులువు అనుకునే వాడిని. అయితే ఐపీఎల్ 2010లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో నా అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. రాబిన్ ఊత‌ప్ప‌, మార్క్ బౌచ‌ర్ నా బౌలింగ్‌లో చెలరేగారు. దీంతో 40 పరుగుల‌కు పైగా ఇచ్చుకున్నా. నా ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే మా జ‌ట్టు (చెన్నై సూప‌ర్ కింగ్స్‌) ప‌రాజ‌యం పాలైంది. ఆ త‌ర్వాతి రెండు మ్యాచ్‌ల‌కు నాకు జ‌ట్టులో చోటు ల‌భించ‌లేదు. 2010 సీజన్‌ నాకు ఒక చెంపపెట్టు. నేను జట్టు నుంచి ఉద్వాసనకు గురైనప్పుడు నాతో కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఏమీ మాట్లాడలేదు. అంతే కాకుండా నాకు అండగా కూడా నిలవలేదు' అని అశ్విన్ తెలిపాడు.

Story first published: Tuesday, April 28, 2020, 10:49 [IST]
Other articles published on Apr 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+