Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ 'వాట్ ఏ స్పెల్'! ఆరు వికెట్లతో చెలరేగిన యాష్.. 69 పరుగులకే సోమర్‌సెట్‌ ఆలౌట్!!

Ravichandran Ashwin picks 5 wicket haul for surrey vs Somerset

లండన్‌: ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ జట్టు సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచులో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీశాడు. ఏకధాటిగా 15 ఓవర్లు వేసి సోమర్‌సెట్‌ నడ్డివిరిచాడు. అశ్విన్‌తో పాటు డేనియల్ మోరియార్టీ 4 వికెట్లు పడగొట్టడంతో సోమర్‌సెట్‌ 69 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్‌ మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నాడు. జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్.

జులై 11 (ఆదివారం)న సోమర్‌సెట్‌, సర్రే మధ్య మ్యాచ్‌ మొదలైంది. పిచ్‌ మందకొడిగా ఉండటంతో సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్‌ కొత్త బంతిని మొదట రవిచంద్రన్‌ అశ్విన్‌ చేతికి ఇచ్చాడు. దీంతో 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా యాష్ రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజీలాండ్ స్పిన్నర్ జీతన్‌ పటేల్‌ ఆరంభ ఓవర్‌ వేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్‌ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. యాష్ తొలిరోజే 28 ఓవర్లు వేయడం గమనార్హం. 5 ఓవర్లు మెయిడిన్‌ వేసిన అశ్విన్‌.. 70 పరుగులిచ్చి టామ్‌ లామన్‌బి (42) వికెట్‌ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 42 ఓవర్లు వేసి ఒకే వికెట్ పడగొట్టాడు. సోమర్‌సెట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసింది.

ఆపై తొలి ఇన్నింగ్స్‌లో సర్రే 240 పరుగులకే ఆలౌట్ అయింది. జాక్ లీచ్ 6 వికెట్లు పడగొట్టగా, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో సోమర్‌సెట్‌ 69 పరుగులకే ఆలౌట్ అయింది. నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి సర్రే మూడు వికెట్లకు 79 రన్స్ చేసింది. క్రీజులో జామీ స్మిత్ (25), అషిమ్ ఆమ్లా (23) ఉన్నారు. విజయానికి ఇంకా సర్రే 18ఓ పరుగులు చేయాలి. ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడనుంది. గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్‌హామ్‌ షైర్‌, వొర్సెస్టర్‌షైర్‌కు ఆడిన అనుభవం అశ్విన్‌కు ఉంది.

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో కొన్నిరోజులు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్‌ ద్వారా మంచి ప్రాక్టీస్‌ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానంను అంగీకరించాడు.

Story first published: Wednesday, July 14, 2021, 20:40 [IST]
Other articles published on Jul 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+