వచ్చే నెల 6 నుంచి భారత్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలేలా ఉంది. గాయం కారణంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరేబియన్లతో వన్డే, టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. సౌతాఫ్రికా పర్యటనలో మూడో వన్డేకు ముందు గాయపడ్డ అశ్విన్ ఆ మ్యాచ్‌లో ఆడలేదు. అయితే స్వదేశంలో విండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కరేబియన్లతో సిరీస్ ప్రారంభం సమయం నాటికి రవిచంద్రన్ అశ్విన్ కోలుకునే అవకాశం లేదట. దీంతో అతను ఈ సిరీస్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడని సమాచారం. కాగా కొంత కాలంగా భారత జట్టులో అశ్విన్ అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కరేబియన్లతో సిరీస్‌లో అశ్విన్ లేకపోవడం భారత జట్టుకు మైనస్‌గా మారే అవకాశం ఉంది.
అశ్విన్ దూరమైనప్పటికీ రోహిత్ శర్మ రూపంలో భారత్‌కు శుభవార్త అందనుంది. కరేబియన్లతో సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండనున్నాడు. గాయం నుంచి అతను పూర్తిగా కోలుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా బుధవారం హిట్‌మ్యాన్‌కు ఫిట్నెస్ పరీక్షల్లో పూర్తి క్లియరెన్స్ రానుందని తెలుస్తోంది. గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు పూర్తిగా దూరమైన రోహిత్ శర్మ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో కోలుకున్నాడు. ఈ క్రమంలో తన బరువు తగ్గించుకున్నాడు. ఏకంగా 6 కిలోలు బరువు తగ్గి రోహిత్ శర్మ స్లిమ్‌గా మారాడు. ఈ సందర్భంగా విడుదలైన హిట్‌మ్యాన్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా విండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును మంగళవారమే ప్రకటించాల్సి ఉంది. కానీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పలు కారణాల రీత్యా నేడు అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ ఎంపికను వాయిదా వేసింది.
కాగా వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య 3 వన్డేల సిరీస్, 3 టీ20ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 6, 9, 11 తేదీలలో వన్డే సిరీస్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 16, 18, 20 తేదీలలో టీ20 సిరీస్ జరగనుంది. అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో మ్యాచ్‌లు జరిగే వేదికలపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో మ్యాచ్‌లన్నీ వేర్వేరు వేదికల్లో కాకుండా ఒకే వేదికపై నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.