Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ మామూలోడు కాదు.. స్కూల్లోనే పటాయించాడు!

భారత క్రికెట్ జట్టులో తన స్పిన్ మాయజాలంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రవిచంద్రన్ అశ్విన్, తన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని కలిగి ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్‌తో అతని బంధం ఒక బాలీవుడ్ సినిమా కథలా ఉంటుంది.

స్కూల్ డేస్ నుంచి స్కూల్ క్రష్ వరకు..
రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణన్ ఇద్దరూ చెన్నైలోని ఒకే పాఠశాలలో చదువుకున్నారు. 7వ తరగతిలో ప్రీతిని అశ్విన్ క్లాస్‌లోకి మార్చడంతో వారి పరిచయం మొదలైంది. ప్రీతిని చూసిన వెంటనే అశ్విన్ ఆమెపై ఆకర్షితుడయ్యాడు. కానీ తన మనసులోని మాటను చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రీతిపై క్రష్ ఉందని స్కూల్లో ఆ సమయంలో అందరికీ తెలుసు. రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి వేరే స్కూల్‌కు మారినప్పటికీ.. పుట్టిన రోజులు, పండుగల సమయంలో ఇద్దరూ స్నేహాన్ని కొనసాగించారు.

Ravichandran Ashwin Love Story Spin Wizard Clean Bowled in Love with Preethi Narayanan

ఇంజనీరింగ్ కాలేజీలో మళ్లీ కలిసిన బంధం
స్కూల్ తర్వాత వారిద్దరూ చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కాలేజీలోనూ వారి స్నేహం మరింత బలపడింది. కానీ అప్పటికి వారి మధ్య ప్రేమ మొదలవ్వలేదు. అయితే కాలేజీ తర్వాత ఇద్దరి జీవితాలు వేర్వేరు మార్గాల్లో సాగాయి. ఈ సమయంలో అశ్విన్ తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి సారించగా.. ప్రీతి ఒక ఈవెంట్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించింది.

చెన్నై సూపర్ కింగ్స్ కనెక్షన్
కాలం గడిచిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగాడు. ఆ సమయంలోనే వారిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ప్రీతి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోసం ఒక ఈవెంట్స్‌ను నిర్వహించే పనిలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ అదే జట్టులో చేరాడు. ఈ కలయిక రవిచంద్రన్ అశ్విన్ మనసులో తిరిగి ప్రేమ భావనలను రేకెత్తించింది. ఈ సారి రవిచంద్రన్ అశ్విన్ మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ప్రత్యేకమైన ప్రపోజల్
రవిచంద్రన్ అశ్విన్ తన ప్రపోజల్ కోసం ఎంతో ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అశ్విన్ ప్రీతిని తొలిసారిగా క్రికెట్ ఆడిన కెమ్‌ప్లాస్ట్ క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లాడు. ఈ స్థలం రవిచంద్రన్ అశ్విన్‌కు తన క్రికెట్ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకం. అక్కడే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. అశ్విన్ చాలా సాధారణంగా, సూటిగా తన మనసులోని మాటను చెప్పాడు. "నేను నా జీవితంలో ఎంతో కాలం నుంచి నిన్ను ఇష్టపడుతున్నాను, ఆ భావన పదేళ్లలో మారలేదు. మనం ఇప్పుడు పెద్దలయ్యాం, ఈ బంధాన్ని కొనసాగిద్దాం" అని అశ్విన్ ప్రీతిని అడిగాడు. ప్రీతి కూడా వెంటనే అశ్విన్ ప్రేమను అంగీకరించింది.

ప్రేమ బంధానికి అధికారిక ముద్ర
2011లో అశ్విన్, ప్రీతి కుటుంబాల సమక్షంలో చాలా సాదాసీదాగా నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం నవంబర్‌లో, తమిళ సంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ జంటకు అఖిరా, ఆద్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో అశ్విన్ అంచెలంచెలుగా ఎదగడానికి, తన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు చేయడానికి అతని వెనుక ప్రీతి నిరంతర తోడు, మద్దతు కారణమని అశ్విన్ ఎప్పుడూ చెబుతుంటాడు.

Story first published: Friday, August 29, 2025, 10:48 [IST]
Other articles published on Aug 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+