Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సూపర్ కింగ్స్ లో లుకలుకలు: తలో దిక్కు: బిగ్ వికెట్ డౌన్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిలకడగా సత్తా చాటుతోన్న ప్లేయర్లల్లో ఒకడు.. సంజు శాంసన్. వికెట్ కీపర్ బ్యాటర్. అటు టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ ఫార్మట్ లో ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఈ రికార్డు అతి కొద్దిమందికి మాత్రమే ఉంది.

దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ మలయాళీ క్రికెటర్. 2013లో రాజస్థాన్ రాయల్స్ తో టై అప్ అయ్యాడు. అప్పటి నుంచీ అదే జట్టులో కొనసాగుతున్నాడు. 2018లో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ.. మళ్లీ అదే ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకుంది. 18 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పొడిగించుకుంది. సుదీర్ఘకాలంగా జట్టు కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు.

Ravichandran Ashwin likely to quit Chennai Super Kings for IPL 2026

తాజాగా ఇదే పరిస్థితి.. చెన్నై సూపర్ కింగ్స్ లోనూ తలెత్తినట్లు కనిపిస్తోంది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ త్వరలో ఆ ఫ్రాంచైజీతో తన బంధాన్ని తెంచుకోనున్నట్లు సమాచారం. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌ నాటికి అతను ఈ ఫ్రాంఛైజీ నుండి వైదొలగనున్నాడు. దీనిపై క్రిక్‌బజ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తోన్నాడు రవి అశ్విన్. ఐపీఎల్ 2026లో మరో ఫ్రాంచైజీలో చేరితే ఈ పదవికి కూడా గుడ్ బై చెప్పొచ్చని తెలుస్తోంది. అశ్విన్ తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎస్కే మేనేజ్మెంట్ కు తెలియజేశాడని సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు.

కాగా- ఈ పరిణామం సీఎస్కే ఫ్రాంఛైజీ.. ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతోంది. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని, కేప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌త సంప్రదింపులు జరుపుతోంది. ప్రత్యామ్నాయం ఎలా ఉండాలి? భవిష్యత్ వ్యూహాలేమిటనే విషయంపై వారితో చర్చిస్తోన్నట్లు చెబుతున్నారు. దీని తర్వాతే రవి అశ్విన్ అంశంపై తుదినిర్ణయానికి రావొచ్చు.

ఈ ఐపీఎల్ సీజన్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు అశ్విన్. 9.75 కోట్ల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. పదేళ్ల విరామం తర్వాత రెండోసారి అతను ఈ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ సీజన్ లో పెద్దగా రాణించలేకపోయాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. 9.13 ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు.

2009 నుండి కొనసాగిన తన ఐపీఎల్ లో కొనసాగుతున్నాడీ వెటరన్ స్పిన్నర్. రావడం రాడంతోనే చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు. 2015 వరకు అదే ఫ్రాంచైజీ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2016 నుండి 2024 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.

ఇప్పటివరకు 220 మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఎకానమీ రేట్ 7.29. బ్యాటింగ్‌లో 118 స్ట్రైక్ రేట్‌తో 833 పరుగులు చేశాడు. అశ్విన్ గనక జట్టు నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితే తలెత్తితే చెన్నై సూపర్ కింగ్స్.. తన స్పిన్ బౌలింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాల్సి వస్తుంది.

Story first published: Saturday, August 9, 2025, 8:01 [IST]
Other articles published on Aug 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+