IPL 2025: CSK ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. 10 ఏళ్ల తర్వాత ధోనీని కలిసిన 'అతడు'
ఐపీఎల్-2025 సీజన్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ 65 రోజుల పాటు సాగగా.. మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు.. ట్రైనింగ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఈ నేపథ్యంలో సీఎఎస్కే ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది.
దాదాపు పదేళ్ల తర్వాత..
సీఎస్కే క్యాంపులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చి చేరాడు. దాదాపు పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. దీంతో ధోనీ, అశ్విన్ కలిసి ప్రాక్టీస్ చేసిన వీడియోను సీఎస్కే అధికారికంగా సోషల్ మీడియాలో పంచుకుంది. వాస్తవానికి సీఎస్కేతోనే అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించాడు. చాలా కాలమే ఆడాడు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వివిధ జట్లకు ఆడాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు సొంత గూటికి చేరాడు. దీంతో ధోనీ, అశ్విన్ మళ్లీ కలిసి ఆడుతుండటం వల్ల చెన్నై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

భారీగా అంచనాలు..
చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సారి రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులోకి చేరడంతో మరింత బలంగా తయారైంది. ముఖ్యంగా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. దీంతో సీఎస్కేపై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు జట్టు సీనియర్స్, యంగస్టర్స్ తో సమతూకంగా ఉంది. జడేజా, అశ్విన్, ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, మదీషా పథిరన, శివమ్ దూబె వంటి ఆటగాళ్లు జట్టులో ఉండడంతో ఆరో సారి సీఎస్కే విజేతగా నిలుస్తుందని అభిమానులంతా ఆశిస్తున్నారు.
బర్త్ డే సెలబ్రేషన్స్
చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ పుట్టిన రోజు వేడుకలు తాజాగా ఈ సీఎస్కే క్యాంపులో గ్రాండ్ గా జరిగాయి. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ధోనీ.. విశ్వనాథన్ కు కేక్ కూడా తినిపించారు. కాగా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈడెన్ గార్డెన్సే ఆతిథ్యమివ్వనుంది.
🤴 Ashwin
— Chennai Super Kings (@ChennaiIPL) February 27, 2025
🏡 Anbuden
💛 Yellove
Homecoming On Time… Oh the feels 🥹✨ #WhistlePodu #DenComing #Yellove pic.twitter.com/7SIP7cLXvk
Yellove remains constant for you, Ash! 💛#WhistlePodu #Yellove 🦁💛@ashwinravi99 pic.twitter.com/INWZgL4Mci
— Chennai Super Kings (@ChennaiIPL) February 28, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications