వరల్డ్‌కప్‌కు జట్టుని ప్రకటించిన గంభీర్: రిషబ్ పంత్‌కు నో ప్లేస్


హైదరాబాద్: ఈ ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టుని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. మొత్తం 15 మందితో కూడిన తన కలల జట్టుని గంభీర్ మంగళవారం ప్రకటించాడు.
వన్డే వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్లుగా శిఖర్ ధావన్-రోహిత్ శర్మలను ఎంపిక చేసుకున్నాడు. మూడో స్థానంలో కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేసిన గంభీర్... ఇప్పటి వరకు ఆ స్థానంలో వస్తున్న కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

పంత్‌కు చోటు దక్కలేదు
రవిచంద్రన్ అశ్విన్‌తో బౌలింగ్ అటాక్ ప్రారంభించాలని సూచించాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అతడిని అనుసరిస్తే బాగుంటుందని తెలిపాడు. భారత్ తరుపున అశ్విన్ చివరగా జులై 2017లో వన్డే మ్యాచ్ ఆడాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, దినేశ్ కార్తీక్‌లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేసిన గంభీర్... యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు చోటు కల్పించలేదు.

నెటిజన్ల ఆగ్రహం
గత కొన్నాళ్లుగా వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న చైనామన్ స్పిన్నర్లు యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు గంభీర్ చోటు కల్పించాడు. కాగా, ఇటీవలే ఓ టాక్ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు గంభీర్ చోటు కల్పించడంపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే వరల్డ్ కోసం గౌతమ్ గంభీర్ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధోనీ, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications