For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదే టీమ్ రా బై

Asia Cup 2025 India Squad: సెప్టెంబర్ 9వ తేదీన ఆరంభం కానున్న ఆసియా కప్ 2025లో ఆడబోయే భారత జట్టుపై అప్పుడే అసహనం, అసంతృప్తి చెలరేగింది. ఈ జట్టులో ఇద్దరు టీ20 స్పెషలిస్టులకు చోటు దక్కకపోవడమే దీనికి కారణం. ఉద్దేశపూరకంగానే వారిని ఎంపిక చేయలేదనే వాదనలు మొదలయ్యాయి.

మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ శుభ్‌మన్ గిల్ కు వైస్ కేప్టెన్సీ బాధ్యత అప్పగించారు. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు.

Ravichandran Ashwin Expresses Heartfelt Sympathy for Shreyas Iyer and Yashasvi Jaiswal

యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కలేదు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ఎంపిక చేశారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే అవకాశాన్ని అందుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలను కొనసాగించారు. మూడో పేసర్‌గా హర్షిత్ రాణాను తీసుకున్నారు.

యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమౌతోంది. టీ20 ఫార్మట్ లో సాగే ఐపీఎల్ మ్యాచ్ లల్లో ఆడిన అపారమైన అనుభవం ఉన్నప్పటికీ వారిద్దరినీ ఎంపిక చేయపోవడం పట్ల మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆశ్చర్యాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

శ్రేయాస్ అయ్యర్‌, జైస్వాల్ ను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని, వారిద్దరికీ తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించాడు. జట్టు సెలెక్షన్ అనేది థ్యాంక్స్ లెస్ జాబ్ గా మారిందని విమర్శించాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన జైస్వాల్ ను తొలగించి శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకువచ్చారని, అది సంతోషకరమే అయినప్పటికీ.. శ్రేయాస్, జైస్వాల్ ను పక్కనపెట్టడం సరికాదని అన్నాడు.

శ్రేయాస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడని రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేశాడు. అలాగే- ఇంగ్లాండ్ పిచ్ లపై జైస్వాల్ సత్తా చాటాడని పేర్కొన్నాడు. శ్రేయాస్ అయ్యర్ కోల్ కత నైట్ రైడర్స్ ను ఛాంపియన్ నిలబెట్టాడు. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్ ను ఫైనల్స్‌కు చేర్చాడు.. అని అశ్విన్ గుర్తు చేశాడు.

శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు 51 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 30.66 యావరేజ్ తో 1104 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్.. 136.12. 2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ ఆడాడు శ్రేయాస్. ఆ తరువాత మళ్లీ ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్స్ లో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.

ఆసియా కప్ 2025 ఆడే భారత జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్స్

ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్

Story first published: Wednesday, August 20, 2025, 8:15 [IST]
Other articles published on Aug 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+