Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన అశ్విన్.. కోహ్లి, రోహిత్‌కు ఐసీసీ షాక్!

గతేడాది సత్తాచాటిన ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ఎంపిక చేస్తూ టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20, వన్డే జట్టులను వెల్లడించిన ఐసీసీ తాజాగా టెస్టు జట్టును ప్రకటించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించిన ఆస్ట్రేలియా.. ఐసీసీ టెస్టు 2023 జట్టులో ఆధిపత్యం చెలాయించింది. ఆసీస్ నుంచి అయిదుగురు చోటు సంపాదించారు. భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెలక్ట్ అయ్యారు.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులో చోటు సంపాదించారు. ఈ క్రమంలో అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్టు టీమ్‌లో వరుసగా మూడు సార్లు చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2023తో పాటు 2021, 2022 ఏడాది క్యాలెండర్ ప్రదర్శన ఆధారంగా ప్రకటించిన జట్టులో అశ్విన్ ఉన్నాడు.

Ravichandran Ashwin created history and ICC shock for Virat Kohli and Rohit Sharma

కాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్‌కు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఆసీస్ జట్టు నుంచి ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్‌ కూడా సెలక్ట్ అయ్యారు. ఓపెనర్లుగా ఖవాజాతో పాటు శ్రీలంక ప్లేయర్ కరుణరత్నె చోటు సంపాదించాడు. మూడు, నాలుగు స్థానాల్లో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఉన్నారు.

ఐసీసీ టెస్టు టీమ్: ఉస్మాన్ ఖవాజా, కరుణరత్నె, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్.

అయితే టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దక్కించుకోకపోవడంపై భారత అభిమానులు ఐసీసీని విమర్శిస్తున్నారు. గతేడాది ఎనిమిది టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ 671 పరుగులు చేశాడు. దాదాపు 56 సగటుతో పరుగులు సాధించాడు. కోహ్లి సగటు ఖవాజా, ట్రావిస్ హెడ్ కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు రోహిత్ శర్మ కూడా మెరుగైన ప్రదర్శనే చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 545 పరుగులు తీశాడు.

ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ 2023: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జేన్సన్, ఆడమ్ జంపా, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమి.

ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ 2023: యశస్వీ జైశ్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, సికిందర్ రజా, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్ , రవి బిష్ణోయ్, రిచర్డ్, అర్షదీప్ సింగ్.

Story first published: Tuesday, January 23, 2024, 15:37 [IST]
Other articles published on Jan 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+