బెంగళూరు: ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం నాడు టెస్టు క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డులు బద్దలు కొట్టాడు. వెస్టిండిస్ - భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ సందర్భంగా అశ్విన్.. సచిన్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా దాటాడు.
వెస్టిండీస్‌తో జరిగిన ఏడు ఇన్నింగ్స్‌లలో అశ్విన్ రెండు సెంచరీలు చేశాడు. 17 వికెట్లు తీశాడు. అతని బెస్ట్ 7/83గా ఉంది. సిరీస్‌లోని నాలుగు ఇన్నింగ్సులలో అతను 235 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 58.75గా ఉంది.
అశ్విన్ ఇప్పటి దాకా ఆరు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. సచిన్, సెహ్వాగ్‌లు ఐదుసార్లు వాటిని గెలుచుకున్నారు. అశ్విన్ 36 టెస్టులలో (13 సిరీస్‌లు)లోనే ఈ ఘనత దక్కించుకున్నాడు. 200 టెస్టులు ఆడిన సచిన్ 74 సిరీస్‌లు ఆడగా, సెహ్వాగ్ 104 మ్యాచులు ఆడాడు.
అందరి కంటే శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో ముందంజలో ఉన్నాడు. అతను 11 దక్కించుకున్నాడు. అతని తర్వాత సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కలీస్ 9 సార్లు సాధించాడు. అశ్విన్ 6 సార్లు సాధించాడు.
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 11 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు.
జాక్వెస్ కల్లిస్ (సౌతాఫ్రికా - 9
ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్), సర్ రిజర్డ్ హాడ్లీ (న్యూజిలాండ్), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) - 8
వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్, శివనారాయణ్ చంద్రపాల్ (వెస్టిండీస్) - 7
అశ్విన్, మార్షల్ (వెస్టిండీస్), ఆంబ్రోస్ (వెస్టిండీస్), స్టీవ్ వా (ఆస్ట్రేలియా) - 6
సచిన్ టెండుల్కర్, సెహ్వాగ్, మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), స్ట్రాస్ (ఇంగ్లాండ్), గ్రహం గూచ్ (ఇంగ్లాండ్), డేల్ స్టెయిన్ (సౌతాప్రికా), వకార్ యూనిస్ (పాకిస్తాన్)