
హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
తద్వారా 1981 నవంబర్ 27న ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ సాధించిన రికార్డును అశ్విన్ అధిగమించాడు. నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. దీంతో 36 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు.

ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు 8 వికెట్ల దూరంలో ఉన్న అశ్విన్... తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించాడు. అశ్విన్ తన కెరీర్‌లో అశ్విన్ ప్రస్తుతం 54వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. కాగా, ఇప్పటివరకు టెస్టుల్లో 26సార్లు 5 వికెట్లు, 7సార్లు పది వికెట్లు తీసుకున్నాడు. తన కెరీర్ ముగిసేలోపు ఇంతకు రెట్టింపు వికెట్లు సాధిస్తానని మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ చెప్పాడు.

ఇదే మ్యాచ్‌లో అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది 50వ టెస్టు వికెట్‌ను అశ్విన్ సాధించాడు. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో పెరీరా వికెట్ ను తీసిన అనంతరం అశ్విన్ ఈ ఘనతను నమోదు చేశాడు.
తద్వారా ఈ క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు వరుసలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ ఉన్నాడు. గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన టెస్టు బౌలర్లో అశ్విన్ 72 వికెట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్లు వీరే:
54: R Ashwin
56: Dennis Lillee
58: Muttiah Muralitharan
61: Richard Hadlee
61: Malcolm Marshall
61: Dale Steyn
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.