ఏం వాసన చూస్తున్నావ్ అశ్విన్? అని ప్రశ్నలు.. సమాధానం ఇచ్చిన వెటరన్ స్పిన్నర్

టీమిండియా అద్భుతంగా రాణిస్తూ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శనతో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించారు. అయితే టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఇప్పటి వరకు బంతితో పెద్దగా రాణించింది లేదు. బ్యాటుతో కొన్ని విలువైన పరుగులు చేసిన అశ్విన్.. తన ప్రధాన బలమైన స్పిన్‌తో పెద్దగా ఆకట్టుకోలేదు.
వైరల్ అవుతున్న వీడియో..
జింబాబ్వేతో మ్యాచ్ టాస్ సమయంలో రోహిత్ శర్మ.. ఇయాన్ బిషప్‌తో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అతనికి కొంచెం దూరంలో అశ్విన్ కనిపించాడు. అక్కడ ఏం చేస్తున్నాడా? అని చూస్తే.. కింద ఉన్న స్వెటర్లలో తనది ఏదో చెక్ చేసుకొని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆ స్వెటర్లను అటూ ఇటూ తిప్పి చూశాడు. ఏం అనుకున్నాడో ఏమో వాటిని వాసన చూసి, ఒకటి అక్కడే పడేసి రెండోది తను తీసుకెళ్లాడు.
అశ్విన్ సమాధానం..
ఈ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. అశ్విన్ ఏం చేస్తున్నాడంటూ ఫన్నీగా కామెంట్లు చేశారు. అభినవ్ ముకుంద్, హర్భజన్ సింగ్ కూడా ఈ వీడియోపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అశ్విన్.. 'ముందుగా సైజు కోసం చెక్ చేశా. దానిపైన ఏమైనా పేర్లు ఉన్నాయేమో అని చూశా. చివరకు నేను వాడే పెర్‌ఫ్యూమ్ వాసన కూడా పరీక్షించి తీసుకున్నా' అని బదులిచ్చాడు.

పేలవ బౌలింగ్..
ఆస్ట్రేలియా పిచ్‌లపై స్పిన్నర్ల నుంచి అద్వితీయమైన ప్రదర్శనలు ఆశించలేం. ఎందుకంటే ఇక్కడి పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ హసరంగ స్పిన్నరే. అంటే స్పిన్నర్లకు కూడా ఈ పిచ్‌ల నుంచి బాగానే సహకారం లభిస్తున్నట్లే కదా. దీన్ని అశ్విన్ ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో జింబాబ్వేపై తీసిన మూడు వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. ఈ వికెట్లు తను తీసినట్లు చెప్పుకోవడానికి లేదని, వాటిని తనే నమ్మలేక మొఖం దాచుకున్నాడని కపిల్ దేవ్ వంటి వాళ్లు కూడా కామెంట్స్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications