For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతను ఇంకా పిల్లాడు.. టీమిండియాలోకి ఎంట్రీ వద్దు: మాజీ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. సీఎస్కేతో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది రికార్డులు నెలకొల్పడంతో.. ఆ కుర్రాడిని వెంటనే టీమిండియా సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయిటే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

విశ్లేషకుల తొందరపాటుపై అశ్విన్ మండిపాటు
మాజీ దిగ్గజాలైన మహమ్మద్ కైఫ్, మైఖేల్ వాన్ వంటి స్టార్లు వైభవ్ సూర్యవంశీ ఆటతీరు చూసి ఐపీఎల్ 2026 ముగియగానే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డాడు. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించిన రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషకులపై తనదైన శైలిలో మండిపడ్డాడు. "వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడే అసాధ్యమైన లక్ష్యాలు పెట్టకండి. అతను ఇంకా పెద్దవాడు కూడా కాలేదు.. కేవలం ఒక చిన్న పిల్లాడు మాత్రమే. ఎంఎస్ ధోనీ 44 ఏళ్ల వరకు ఆడుతున్నప్పుడు.. వైభవ్ 40 ఏళ్ల వరకు ఆడినా అతడికి ఇంకా రెండున్నర దశాబ్దాల క్రికెట్ భవిష్యత్తు ఉంది. అతడిని ప్రశాంతంగా వదిలేయండి" అని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.

Ravichandran Ashwin Advises Against Rushing Vaibhav Suryavanshi India Debut Slams Experts Demands

సమయం వచ్చినప్పుడు ఆడే వజ్రం
వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌ను ప్రశంసిస్తూనే.. అతడిని తొందరగా అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని అశ్విన్ హెచ్చరించాడు. "అతను భారత్ తరపున ఆడేందుకు చాలా గొప్ప ఆటగాడు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఆడతాడు. మనం ఎప్పుడూ ఎందుకు అంత తొందర పడతాం?" అని అశ్విన్ ప్రశ్నించాడు. గతేడాది 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. అతి చిన్న వయస్సులో సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అండర్-19, భారత్ 'ఏ' జట్లలో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.

వైభవ్ బ్యాట్ స్పీడ్‌కు అశ్విన్ ఫిదా!
గౌహతిలోని పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నప్పటికీ.. వైభవ్ ఆడిన షాట్లు అశ్విన్‌ను మంత్రముగ్ధుడిని చేశాయి. "అతనికి 15 ఏళ్లు నిండాయి, అందుకే 15 బంతుల్లోనే 50 కొట్టాడు. తన వయసును ఇలా చూపిస్తున్నాడన్నమాట! అతని బ్యాట్ స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అతని ముందు సీఎస్కే బౌలర్లు ఏమీ చేయలేకపోయారు. వైభవ్‌తో రాజస్థాన్ రాయల్స్ ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది," అని అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతానికి వైభవ్‌ను ఓ నూతన ఉత్తేజంగా చూడాలే తప్ప, సీనియర్ జట్టులోకి పంపాలని ఒత్తిడి చేయడం సరైనది కాదని అశ్విన్ అభిప్రాయం.

Story first published: Tuesday, March 31, 2026, 13:27 [IST]
Other articles published on Mar 31, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+