శాస్త్రి, జహీర్, ద్రవిడ్‌కు సోషల్ మీడియాలో స్వాగతం పలికారు
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నియామకం పట్ల పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు కోచ్‌గా రవిశాస్త్రిని నియమించడం వల్ల భారత క్రికెట్ మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరూ ఊహించినట్టుగానే రవిశాస్త్రి పేరుని మంగళవారం రాత్రి బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో గతంలో టీమిండియా డైరెక్టర్‌గా పనిచేసిన రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే వారసుడిగా 2019 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
సురేశ్ రైనా
కోచ్‌లుగా నియమితులైన రవిశాస్త్రి, జహీర్‌ఖాన్, రాహుల్‌ద్రవిడ్‌లకు సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు.
ఆకాష్ చోప్రా
‘బంగర్, శ్రీధర్ తమ పాత్రల్లోనే కొనసాగబోతున్నారు. రవిశాస్త్రి గతంలో పోషించిన పాత్రనే ఇప్పుడూ పోషిస్తారు. కేవలం హోదాలు మారాయి అంతే' అని ఆకాష్ చోప్రా ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
హర్భజన్‌సింగ్
‘నా సోదరుడు జహీర్‌ఖాన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పాత్రకు ఆల్‌ద బెస్ట్' అని హర్భజన్‌సింగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
మహమ్మద్ కైఫ్
మాజీ క్రికెటర్ కైఫ్ ‘జహీర్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవడం అద్భుత నిర్ణయం. రవిశాస్త్రి నేతృత్వంలోని భారత జట్టుకు శుభాకాంక్షలు. ఇక అంతా క్రికెట్‌పైనే దృష్టిపెడతరాని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications