For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైభవ్ గురించి రవిశాస్త్రి ఇలా ఎందుకన్నాడు?.. యువ ఆటగాళ్లకు హెచ్చరిక

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో చాలా మంది యువ ఆటగాళ్లు తమ అద్భుతమైన ఆటతో సంచలనం సృష్టించారు. ప్రియాన్ష్ ఆర్య, ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చిన్న వయస్సులోనే ఐపీఎల్‌లో ఆడిన తీరు చూసి అతడిని భవిష్యత్ స్టార్ అని పిలుస్తున్నారు. అయితే భారత మాజీ కోచ్ రవిశాస్త్రి యువ ఆటగాళ్లకు హెచ్చరిక చేశాడు. ఏదో ఒక రోజు ఈ యువ ఆటగాళ్లు భారత్ తరఫున ఆడతారని.. కానీ జాగ్రత్తగా ఉండాలని రవిశాస్త్రి వారికి సలహా ఇచ్చాడు.

ఐసీసీ సమీక్షలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న ఆయుష్ మాత్రే, రాజస్థాన్ రాయల్స్ కు చెంది వైభవ్ సూర్యవంశీ, పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ల ప్రదర్శన తనను చాలా ఆకట్టుకుందని అన్నారు. పంజాబ్ ఓపెనర్లు ఇద్దరూ వచ్చిన వెంటనే సిక్స్ లు, ఫోర్లు కొడుతున్నారని రవి శాస్త్రి అన్నారు. వారు వచ్చిన వెంటనే మొదటి ఆరు ఓవర్లలో అద్బుతంగా ఆడారన్నారు.

Ravi Shastri Warns Young Sensation Vaibhav Suryavanshi After Impressive IPL Debut

రవిశాస్త్రి హెచ్చరిక
ఈ ఐపీఎల్ సీజన్‌లో రవి శాస్త్రి కొంత మంది యువ ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు హెచ్చరిక జారీ చేశాడు. ఆయుష్ మాత్రే గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌తో ఆయుష్ మాత్రే ఆడిన షాట్లు నమ్మశక్యం కానివని.. 17 వయస్సులో అతను స్వేచ్ఛగా ఆడటం చూసి అందరూ ముగ్ధులయ్యారని రవిశాస్త్రి అన్నారు. ఆయుష్ మాత్రేకు సరిగ్గా ప్రోత్సహిస్తే చాలా దూరం వెళ్లగలడని ఆయన చెప్పారు. ఆయుష్ మాత్రేతో పాటు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి కూడా రవిశాస్త్రి మాట్లాడారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర మ్యాచ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు. తన తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. రవిశాస్త్రి వైభవ్ సూర్యవంశీని ప్రశంసించి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. వైభవ్ ఆడిన మొదటి షాట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని.. కానీ వైభవ్ చాలా చిన్నవాడని.. అతను కూడా తప్పులు చేస్తాడని.. వాటిని వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలన్నారు.

జాగ్రత్తగా ఉండమని వైభవ్ సూర్యవంశీకి రవిశాస్త్రి సూచన
వైభవ్ సూర్యవంశీ గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ... ప్రారంభ విజయం తర్వాత వైభవ్ మరింత కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందన్నాడు. బౌలర్లు అతడిపై అటాక్ చేస్తారన్నారు. వైభవ్ కు చాలా షార్ట్ పిచ్ బంతులు వస్తాయన్నారు. మొదటి బంతికే సిక్స్ కొట్టినప్పుడు ఎవరూ కనికరం చూపించరని.. వైభవ్ దానికి అలవాటు పడాలన్నారు. దీని అర్థం బౌలర్లు అతడిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. వైట్-బాల్ క్రికెట్‌లో భారతదేశంలో చాలా ప్రతిభ ఉందని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. బాగా రాణిస్తున్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన సెలెక్టర్లకు చెప్పారు.

Story first published: Sunday, April 27, 2025, 14:54 [IST]
Other articles published on Apr 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+