
పేస్ తగ్గించకుండా స్టంప్‌లను టార్గెట్ చేయాలి
నిన్న జరిగిన ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన మొదటి ఓవర్లో పరుగులు ఇచ్చాడు. అతను రెండో స్పెల్‌లో.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డేనియల్ సామ్స్‌ల వికెట్లు పడగొట్టి ముంబైని గట్టి దెబ్బతీశాడు. మాలిక్ తన ప్రధాన బలమైన వేగవంతమైన డెలివరీలతో ఈ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బ్యాటర్ల బాడీలనే టార్గెట్ చేస్తూ పదునైన పేస్ వేసిన మాలిక్ తొలుత ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి ముంబైని ఇబ్బంది గురిచేశాడు. తర్వాత కన్సిస్టెన్సీ ప్లేయర్ అయిన తిలక్ వర్మను ఔట్ చేసి ముంబై పతనానికి నాంది వేశాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ తన 3ఓవర్లలో 3/23ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా జరగగా చివరికి సన్ రైజర్స్ 3పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి ఈఎస్పీఎన్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. మాలిక్ తన పేస్‌ను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరముందన్నాడు. పేస్ తగ్గించకుండా స్టంప్‌లపై ఎటాక్ చేసేలా బౌలింగ్ కొనసాగించాలని పేర్కొన్నాడు.

అలా చేస్తే టీమిండియాకు ఎదురుండదు
ఇక మాలిక్ ప్రదర్శన పట్ల ముగ్ధుడైన రవిశాస్త్రి బీసీసీఐకి సూచనలిస్తూ.. అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తీసుకోవాలని పేర్కొన్నాడు. అలాగే కోచ్ సిబ్బందికి సూచిస్తూ.. 'అతనికి బౌలింగ్ చేయాల్సిన లెంత్ మీద అవగాహన కల్పించండి. స్టంప్‌ల మీద దృష్టి పెట్టాలని చెప్పండి. అతనికి అవసరమైన ఇతర ఇతర నైపుణ్యాలను నేర్చుకోనివ్వండి. నేను కచ్చితంగా చెప్పగలిగేదేంటంటే రెడ్-బాల్ క్రికెట్ (టెస్ట్)లో అతను స్థిరమైన ప్లేయర్‌గా మారగలడు. బుమ్రా, షమీతో పాటు బౌలింగ్ యూనిట్లో ఉమ్రాన్ మాలిక్‌ను దింపితే.. భారత బౌలింగ్ అటాక్ అత్యంత తీవ్రమైందిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.'

పర్పుల్ క్యాప్ రేసులోనూ..
జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్లో వెలుగు చూసిన అత్యంత ప్రతిభావంతుడైన ప్లేయర్‌గా పేరొందాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2022లో 13మ్యాచ్‌లలో 21వికెట్లు తీసిన మాలిక్.. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితా (పర్పుల్ క్యాప్) రేసులో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఈ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ బంతులు వేస్తున్న ప్లేయర్‌గానూ అతను గుర్తింపు పొందాడు. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన డెలివరీ (157కి.మీ/గం ) అతని పేరిటే ఉంది. అతను అడపాదడపా స్పీడ్ బంతులు వేసే బౌలర్ కాదు. అత్యంత కన్సిస్టెన్సీతో వేగవంతమైన బౌలింగ్ చేసే సామర్థ్యమున్న ప్లేయర్.


Click it and Unblock the Notifications
