సచిన్ టెండుల్కర్: కొత్త డిమాండ్ ముందుకు తెచ్చిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికైనా అనంతరం మిగతా సహాయకులుగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారిని కాదని, తనకు నచ్చిన వారిని తీసుంటానని హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. తాజాగా మరో కొత్త కోరికను బయటపెట్టాడు.

సచిన్ కావాలని డిమాండ్
టీమిండియా విదేశీ పర్యటనలకు బయలుదేరే సమయంలో జట్టుకు కన్సల్టెంట్‌గా సచిన్ టెండూల్కర్ కావాలనే డిమాండును తెరపైకి తీసుకు వచ్చాడు.

ద్రావిడ్, జహీర్‌ల పేరు చెప్తే..
సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కూడిన సెలక్షన్ కమిటీ బ్యాటింగ్ కోచ్‌గా ద్రావిడ్‌ను, బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను ఎంపిక చేసింది.

కన్సల్టెన్సీ సేవల కోసం..
వారిని కాదన్న రవిశాస్త్రి బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను పట్టుబట్టి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనకు కన్సల్టెన్సీ సేవలందించేందుకు సచిన్‌ను కోరుతుండటం గమనార్హం.

బంగర్ అసిస్టెంట్ కోచ్
కాగా, రవిశాస్త్రి పంతం మేరకు భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికవగా.. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా దక్కింది. ఆర్ శ్రీధర్ ఫీల్డ్ కోచ్‌గా కొనసాగుతారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications