న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటములే గుణపాఠాలై.: ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడతామంటోన్న రవిశాస్త్రి

Ravi Shastri under fire after England series defeat

హైదరాబాద్: వైఫల్యాలతో ముగించిన ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రికి మంచి గుణపాఠాలు నేర్పింది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అతి విశ్వాసంతో ప్రగల్భాలు పలికిన రవిశాస్త్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. పైగా టెస్టు సిరీస్ ఘోర వైఫల్యాలకు కారణమైయ్యాడు. దీంతో కోచ్ రవిశాస్త్రి.. కెప్టెన్ కోహ్లీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తాయి.

<strong>దుబాయ్‌కు చేరిన టీమిండియా.. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం</strong>దుబాయ్‌కు చేరిన టీమిండియా.. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం

వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేలా

వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేలా

ఆ అనుభవంతో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేలా చూడాలని బీసీసీఐని రవిశాస్త్రి కోరనున్నాడట. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత్‌ నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా దాన్ని ఒక రోజు తగ్గించి మూడు రోజుల పాటు మాత్రమే ఆడింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు.

ప్రాక్టీసు మ్యాచ్ విషయంలో అలసత్వం దేనికి:

ప్రాక్టీసు మ్యాచ్ విషయంలో అలసత్వం దేనికి:

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడితేనే టెస్టుల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాంటిది ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ ప్రశ్నించింది. దీంతో రవిశాస్త్రి ఈ ఏడాది నవంబరులో ఆసీస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేలా ముందే ప్లాన్‌ చేసుకుంటామని తెలిపాడు. ఇంగ్లాండ్‌ పర్యటన అనంతరం భారత్‌ చేరుకున్న రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు.

 ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు బిజీ షెడ్యూల్ వల్లే :

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు బిజీ షెడ్యూల్ వల్లే :

‘బిజీ షెడ్యూల్ కారణంగానే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నాం. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ పర్యటనలను పరిగణనలోకి తీసుకుంటే టీ20, వన్డే సిరీస్‌ల తర్వాత కొద్ది రోజుల విరామంలోనే టెస్టు సిరీస్‌లు ప్రారంభమయ్యాయి. ఆ కొద్ది రోజుల్లోనే ఎన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలి?. ఈ ఏడాది నవంబరులో టీమిండియా ఆసీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడతాం. ఇదే విషయాన్ని బీసీసీఐని కోరతాను' అని శాస్త్రి తెలిపాడు.

ఆస్ట్రేలియా పర్యటన తేదీలు:

ఆస్ట్రేలియా పర్యటన తేదీలు:

ఈ ఏడాది నవంబరు 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆసీస్‌తో భారత్‌ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. మొదట టీ20లు అనంతరం ఇరు జట్ల మధ్య డిసెంబరు 6 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ పర్యటన కంటే ముందు భారత్ ఆసియా కప్ లో తలపడనుంది. సెప్టెంబరు 15 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీలో భారత్ సెప్టెంబరు 18న తొలి మ్యాచ్ ఆడుతుంది.

Story first published: Friday, September 14, 2018, 15:30 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X