Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరుగురికి ఇంటర్వ్యూలు: కోచ్ పదవికి ఫేవరెట్‌గా రవిశాస్త్రి

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ నిర్దేశించిన దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది.

ఆదివారం నాటికి గడువు తేదీ ముగిసే నాటికి కోచ్ పదవి కోసం మొత్తం 10 దరఖాస్తులు బీసీసీఐ అందాయి. టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, రిచర్డ్‌ పైబస్‌, దొడ్డ గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, లాన్స్‌ క్లూసెనర్‌, రాకేశ్‌ శర్మ, ఫిల్‌ సిమన్స్‌, ఉపేంద్రనాథ్‌ బ్రహ్మచారి దరఖాస్తులు చేసుకున్నవారిలో ఉన్నారు.

ఆరుగురిని మాత్రమే ఇంటర్యూ చేయనున్న సీఏసీ

ఆరుగురిని మాత్రమే ఇంటర్యూ చేయనున్న సీఏసీ

వీరిలో క్రికెట్ సలహా కమిటీ కేవలం ఆరుగురిని మాత్రమే ఇంటర్యూ చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిలో రవి శాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, ఫిల్ సిమన్స్‌, రిచర్డ్‌ పైబస్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రేసులో రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నాడు.

తొలుత దరఖాస్తు చేయని రవిశాస్త్రి

తొలుత దరఖాస్తు చేయని రవిశాస్త్రి

నిజానికి టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి తొలుత దరఖాస్తు చేసుకోలేదు. మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టామ్‌మూడీ, రిచర్డ్‌ పైబస్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, దొడ్డా గణేష్‌లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కుంబ్లే రాజీనామాతో దరఖాస్తు చేసుకునే గడువును కమిటీ పొడగించడంతో రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నాడు.

సచిన్ ఒప్పించడం వల్లే

సచిన్ ఒప్పించడం వల్లే

క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్... రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు సైతం రవిశాస్త్రికే ఉన్న నేపథ్యంలో అతనివైపే సీఏసీ మొగ్గుచూపుతుందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాన కోచ్ పదవి ఎవరికి దక్కుతుందో

ప్రధాన కోచ్ పదవి ఎవరికి దక్కుతుందో

సోమవారం క్రికెట్ సలహా కమిటీ సమావేశమై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ పదవి ఎవరికి దక్కుతుందో అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆనంతరం ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+