
ధోని ఓ గొప్ప నాయకుడు
'ధోని ఓ గొప్ప నాయకుడు. అతడిపై వస్తున్న విమర్శలు పెద్ద లెక్కలోవి కావు. జట్టులో ధోని ఎక్కడున్నాడో మన మనసుకు తెలుసు. ధోని ఇప్పుడు అల్టిమెట్ టీం మెంబర్. అతనొక గొప్ప ఆటగాడని, దిగ్గజ క్రికెటర్లు వారి భవిష్యత్తుని వారే నిర్ణయించుకుంటారు' అని రవిశాస్త్రి తెలిపాడు.

ప్రతి సారి నన్ను టీవీ షోలో ప్రశ్నించే ప్రశ్నలు ఇవే
'ప్రతి సారి నన్ను టీవీ షోలో ప్రశ్నించే ప్రశ్నలు ఇవే ధోనిని టీ20ల నుంచి తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు, దీనీపై మీ స్పందన ఏమిటి అని. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే. ధోని ఒక సూపర్ స్టార్.. అతనో ఓ అద్బుతమై ఆటగాడు కాబట్టే టీవీ చానళ్లు ధోని సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సంచలనం చేస్తున్నాయి' అని పేర్కొన్నాడు.

శ్రీలంక, ఆస్ట్రేలియా సిరిస్ విజయాల్లో ధోని కీలకపాత్ర
'ధోని 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తన వన్డే యావరేజ్ 60కి తగ్గలేదని, గత శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్‌ల్లో కీలకపాత్ర పోషించి జట్టుకు విజయాలను అందించిన సందర్భాన్ని గుర్తు పెట్టుకోవాలి' అని రవిశాస్త్రి ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ధోనిపై విమర్శలు చేసిన లక్ష్మణ్, అగార్కర్, ఆకాశ్ చోప్రా
కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టీ20లో ధోని నెమ్మది బ్యాటింగ్ చేయడంతో మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్, ఆకాశ్ చోప్రాలు టీ20ల నుంచి తప్పుకొని యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని విమర్శించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











