Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీకి చురకలు అంటించిన రవిశాస్త్రి!!

విరాట్ కోహ్లీ.. ఈ జనరేషన్ లో బెస్ట్ బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహాలు లేవు. విరాట్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో, ఎంత గొప్ప బ్యాటరో అతడి గణాంకాలే చెబుతున్నాయి. అయితే పలు సందర్భాల్లో అతడు జట్టు కోసం కన్నా ఎక్కువగా వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ఈ విషయంపై చర్చ మొదలైంది. అందుకు కారణం టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి. అతడు శ్రేయస్ అయ్యర్ తో కలిసి చేసిన సంభాషణే.. కోహ్లీపై చర్చకు దారీ తీసింది.

అసలేం జరిగిందంటే
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97*) మూడు బంతులు ఉండగా సెంచరీని వదిలేశాడు. వ్యక్తిగత సెంచరీ/రికార్డు కన్నా జట్టు కోసమే ఆడటమే ముఖ్యమని చాటి చెప్పాడు. మ్యాచ్ సమయంలో మరో ఎండ్ లో ఉన్న శశాంక్‌ సింగ్‌ తో తనకు స్ట్రైకింగ్‌ రాకపోయినా ఫర్వాలేదు, తన సెంచరీ గురించి ఆలోచించొద్దు, వేగంగా ఆడాలి అంటూ సూచించాడు.

Ravi Shastri Takes a Dig at Virat Kohli After Shreyas Iyer s selfless century in pbks vs gt

కోహ్లీని ఉద్దేశించి...
ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం.. రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు శశాంక్‌ సమాధానంగా చెప్పాడు. అప్పుడు రవిశాస్త్రి.. "ఇది కరెక్ట్ డెసిషన్. టీమ్‌ గేమ్‌లో ఇలానే ఆడాలి. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడకూడదు'' అని చెప్పుకొచ్చాడు. వెంటనే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అవి కోహ్లీనే ఉద్దేశించి రవిశాస్త్రి అన్నాడ"ని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కోహ్లీ ఏం చేశాడంటే
2019 ఐపీఎల్‌ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ .. సెంచరీ కోసం మ్యాచ్ చివర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించలేదు. అప్పటికీ 96 పరుగులతో ఉన్న కోహ్లీ స్ట్రైక్ కోసం ఆగి లాస్ట్ కు బౌండరీతో శతకాన్ని పూర్తి చేశాడు. అలానే గత వన్డే వరల్డ్ కప్ లోనూ బంగ్లాదేశ్ శతకం పూర్తి చేయాడానికి ప్రాధాన్యత ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి. అవే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి.

Story first published: Wednesday, March 26, 2025, 14:05 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+