
హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా జరిగిన చివరి టెస్టులో నాలుగో రోజు ఉదయం పిచ్ బాగా తడిగా ఉండటంతో తాను ఆశ్చర్యపోయానని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. బౌలర్లతో పాటు రహానె, కోహ్లీ రాణించడంతో రసవత్తరంగా జరిగిన ఈ పోరులో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
'పిచ్ చాలా తడిగా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. శనివారం ఉదయం చూసేసరికి ఇంకా పిచ్‌పై కవర్లు కప్పేసి ఉన్నాయి. ఇదెలా జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత మైదానం సిబ్బంది పిచ్ ఉపరితలాన్ని గట్టిగా చేసేందుకు పెద్ద రోలర్‌ను ఉపయోగించారు. అప్పుడు ఆడేందుకు పిచ్ మెరుగ్గానే అనిపించింది. అయితే తడి ఆరుతున్నా కొద్దీ పగుళ్లు ఇంకా స్పష్టంగా కనిపించాయి.' అని రవిశాస్త్రి అన్నాడు
'వికెట్ చాలా ప్రమాదకరంగా అనిపించింది. బుమ్రా బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గర్ నుదురుకు బంతి తగిలినప్పుడు అంపైర్లు ఆట నిలిపివేయడంపై రవిశాస్త్రి స్పందించారు. 'టెస్టును నిలిపివేస్తారన్న సందేహం నాకెంతమాత్రం లేదు. ఇంకా 20 నిమిషాలుండగా ఆట ఆపేసినప్పుడు అవకాశాలు అప్పటికి మా వైపే ఉన్నాయి.'అని వివరించాడు.
'ఈ పిచ్‌పై మేం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. విదేశాల్లో టీమిండియా సాధించిన అత్యంత గొప్ప విజయాల్లో ఒకటి. పచ్చిక ఉన్న ఆ వికెట్‌పై మేం మొదట బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు చాలా మంది నవ్వారు. అయితే మా కారణాలు మాకున్నాయి. మేం అద్భుతంగా పోరాడాం. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న జట్టుగా ఆడాం' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.