
హైదరాబాద్: 2018ని తనదైన స్టయిల్లో ఆహ్వానించాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రవిశాస్త్రి డీజే అవతారమెత్తాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా కొత్త సంవత్సర వేడుకలను టీమిండియా దక్షిణాఫ్రికాలో జరుపుకుంది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి డిస్క్‌జాకీ(డీజే)గా మారాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.
ఈ ఫోటోపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'డీజే రవి' అంటూ ఓ నెటిజన్ శాస్త్రి ఫోటోపై కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల కోసం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా టీమిండియా తన తొలి టెస్టు మ్యాచ్‌ని కేప్ టౌన్ వేదికగా జనవరి 5న ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ టెస్టు సిరిస్‌ను గనుక కోహ్లీసేన గెలిస్తే సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. ఇప్పటికే టీమిండియా వరుసగా తొమ్మిది టెస్టు సిరిస్‌లను గెలిచిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.