న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత జట్టు డిక్షనరీలో 'నా' అనే పదం లేదు.. 'మనం' మాత్రమే ఉంది: రవిశాస్త్రి

Ravi Shastri says The word I is not there in our dictionary

ఆక్లాండ్‌: భారత జట్టు డిక్షనరీలో 'నా' అనే పదం లేదు, 'మనం' మాత్రమే ఉంది. ఆటగాళ్లు అందరూ సహచరుల విజయాల్ని ఆస్వాదిస్తారు అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. ఏడాది టీ20 ప్రపంచకప్‌ సాధించడమే మా లక్ష్యం. టాస్‌తో మాకు పనే లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలం అని రవిశాస్త్రి అన్నారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్ టీమిండియా గురించి పలు విషయాలు వెల్లడించారు.

'ఆదాయం వచ్చేది పురుషులతోనే.. వారితో సమానంగా జీతాలు అడగటం సరికాదు''ఆదాయం వచ్చేది పురుషులతోనే.. వారితో సమానంగా జీతాలు అడగటం సరికాదు'

టాస్‌తో మాకు పనేలేదు:

టాస్‌తో మాకు పనేలేదు:

రవిశాస్త్రి మాట్లాడుతూ... 'మా ప్రణాళికల నుంచి టాస్‌ను తీసేశాం. టాస్‌తో మాకు పనేలేదు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలం. ప్రపంచంలోని ఏ దేశమైనా.. ఎంతటి ప్రత్యర్థులనైనా ఎదుర్కోగలం. భారీ స్కోర్లనైనా ఛేదిస్తాం. అంతిమంగా అదే మా లక్ష్యం. ఈ సంవత్సరం జరిగే టీ20 ప్రపంచకప్‌ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం శ్రమిస్తున్నాం' అని అన్నారు.

'నా' అనే పదం మా డిక్షనరీలో లేదు:

'నా' అనే పదం మా డిక్షనరీలో లేదు:

'భారత జట్టు డిక్షనరీలో 'నా' అనే పదం లేదు. 'మా' అని మాత్రమే ఉంటుంది. ఆటగాళ్లు అందరూ సహచరుల విజయాల్ని ఆస్వాదిస్తారు. ఎందుకుంటే అది జట్టు విజయం. జట్టు మొత్తం సమష్టిగా ఉంది. ఎవరు రాణించినా అందరూ ప్రశంసించుకుంటారు. సీనియర్లు, జూనియర్ల మధ్య మంచి వాతావరణం ఉంది' అని రవిశాస్త్రి తెలిపారు.

 ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో నిరూపించాం:

ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో నిరూపించాం:

'ఒత్తిడిలో కూడా బాగా ఆడగలం అని ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో నిరూపించాం. వాంఖడేలో ఓటమిని చవిచూసినా.. అద్భుతంగా పుంజుకొని రెండు విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకున్నాం. మేం ఎటువంటి బెరుకు లేకూండా క్రికెట్‌ ఆడతామని చాటి చెప్పాం. కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్పగా జట్టును నడిపించాడు. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు బాగా ఆడుతున్నారు. పటిష్ట జట్టు మనకు ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలరు. చాలా ఆనందంగా ఉంది' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

ధావన్‌ దూరంకావడం బాధాకరం:

ధావన్‌ దూరంకావడం బాధాకరం:

'గతంలో జరిగిన దాన్ని చరిత్ర అంటారు. అయితే మేం ప్రస్తుతం గురించే ఆలోచిస్తాం. గత ప్రదర్శనను పరిశీలించి భవిష్యత్తులో ఎలా ఆడాలనే ఆలోచిస్తాం. గాయంతో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ జట్టుకు దూరం కావడం ఎంతో బాధాకరం. అతడు సీనియర్ ఆటగాడు, మ్యాచ్‌ విన్నర్. జట్టులో ఎవరికి గాయమైనా జట్టు అంతా బాధపడుతుంది' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది.

Story first published: Thursday, January 23, 2020, 10:07 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X