Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ విరామం తీసుకున్నాడు.. ఐపీఎల్‌ ఆడుతాడు.. ప్రపంచకప్‌ పోటీలో కూడా!!

MS Dhoni Is A Legend, Won't Impose Himself On Team India : Ravi Shastri || Oneindia Telugu
Ravi Shastri says MS Dhoni Will Not Impose Himself On Indian Team


ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కావాలని విరామం తీసుకున్నాడు. కానీ.. ఐపీఎల్‌-13 ఆడనున్నాడు అని హెడ్ కోచ్‌ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి పాలైన తర్వాత ధోనీ నిరవధిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి.
కావాలనే విరామం:

కావాలనే విరామం:

తాజాగా రవిశాస్త్రి ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోనీ భవిత్యంపై వస్తున్న పుకార్లపై స్పందించారు. 'ధోనీ దిగ్గజ ఆటగాడు. తనకు తెలిసి టీమిండియాలోనే ఉండాలన్నది మహీ చివరి కోరిక. జట్టుకు భారంగా ఉండాలని మహీ ఎప్పుడూ అనుకోడు. కావాలనే ధోనీ విరామం తీసుకున్నాడు' అని రవిశాస్త్రి తెలిపారు.

 చర్చలు ఆపండి:

చర్చలు ఆపండి:

ఐపీఎల్‌-13లో తప్పకుండా ఆడుతాడు. లీగ్‌ తర్వాత తన ఆటను సమీక్షించుకొని.. జాతీయ జట్టుకు ఆడగలనని భావించి టీ20 ప్రపంచకప్‌ జట్టు పోటీలో నిలిస్తే అప్పుడెలాంటి గందరగోళం ఉండదు. ధోనీ జట్టులో ఆడాలనుకుంటే కొనసాగుతాడు. ఈ విషయంపై మిగతా వాళ్లు చర్చలు ఆపండి' అని రవిశాస్త్రి అన్నారు.

గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా:

గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా:

'మొదటగా బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ సౌరవ్ గంగూలీ ఎంపికవ్వడంతో ఆశ్యర్యపోయా. బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్‌ ఆడింది. అయితే ఇప్పుడు గంగూలీ అధ్యక్షతనలో బోర్డు ఏర్పాటు అవడం సంతోషంగా ఉంది. దాదా టీమిండియాను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇప్పుడు బోర్డును కూడా సరైన నిర్ణయాలతో నడుపుతాడు. అతనిపై నమ్మకం ఉంది' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

నిరవధిక విరామం:

నిరవధిక విరామం:

ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి పాలైన తర్వాత ధోనీ నిరవధిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవలే మహీ ముంబైలో మీడియాతో మాట్లాడాడు. ఓ జర్నలిస్ట్ క్రికెట్ కెరీర్ భవితవ్యం గురించి ప్రశ్నించగా.. 'జనవరి వరకు నన్నేమీ అడగొద్దు' అని బదులిచ్చాడు. గత నెలలో ఝార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి ధోనీ సాధన చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, December 11, 2019, 13:14 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+