Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: 'ఫైనల్‌లో అతడిపై వేటు - ఆ ముగ్గురు నుంచి భారత్‌కు పెద్ద ముప్పు!!'

మార్చి 9న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్‌ - న్యూజిలాండ్‌ ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి. అందుకు గల కారణాన్ని వివరించాడు. "ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ - ఆసీస్ తుది జట్లలో ఓ మార్పు చోటు చేసుకున్నా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే ఈ నిర్ణయం పిచ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్‌ ఎంతో బెస్ట్. కాబట్టి ఈ మ్యాచ్‌ పూర్తైన తర్వాత గ్రౌండ్స్‌మెన్‌కు దాదాపు ఐదు రోజుల గ్యాప్ దొరికింది. అందుకే 280 నుంచి 300 పరుగుల చేయగలిగే పిచ్‌ తయారు చేయొచ్చు." అని చెప్పుకొచ్చాడు. అయితే, ఎవరిపై వేటు వేసి? ఎవరిని తీసుకోవచ్చనేది మాత్రం చెప్పలేదు.

ఆ ముగ్గురు నుంచి పెద్ద ముప్పు..
న్యూజిలాండ్ జట్టులోని ముగ్గురు ప్లేయర్ల నుంచి భారత్ కు పెద్ద ముప్పు ఉందని చెప్పాడు రవిశాస్త్రి. వారి నుంచి భారత్‌కు బిగ్ ఛాలెంజ్ ఎదురుకానుందని తెలిపాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న 25 ఏళ్ల రచిన్ రవీంద్రతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు రవిశాస్త్రి. అతడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే 2 సెంచరీలు బాదాడని గుర్తుచేశాడు.

Ravi Shastri Says a change in India XI for Champions Trophy 2025 final ind vs New Zealand

ఫైనల్ లో కేన్ విలియమ్సన్ కూడా కీలకంగా వ్యవహరిస్తాడని అన్నాడు రవిశాస్త్రి. "అతడు ఎంతో నిలకడగా, కామ్ గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు" అని పేర్కొన్నాడు. కేన్ మామ ఈ ట్రోఫీలో భారత్ పై (81), సౌతాఫ్రికాపై (102) అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. బ్లాక్ క్యాప్స్‌లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా కీలకమైన ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు రవిశాస్త్రి. "అతడు బ్యాట్, బాల్‌తో రాణిస్తున్నాడు. అతడు అద్భుతమైన తెలివైన వ్యక్తి. అతడు కెప్టెన్సీ అద్భుతంగా చేస్తున్నాడు." అని అన్నాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు...
గ్లెన్ ఫిలిప్స్ అన్ ప్రెడిక్టబుల్ అని, అతడి దూకుడు ఆటతీరు అద్భుతంగా ఉందని ప్రస్తావించాడు రవిశాస్త్రి. ఫైనల్ లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు గట్టి పోటీనిస్తాడని అభిప్రాయపడ్డాడు. "అతడు 40-50 పరుగులు చేయడంతో 2,3 వికెట్లు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టీమిండియా అక్సర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు పోటీగా ఉండొచ్చు." అని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, March 8, 2025, 12:54 [IST]
Other articles published on Mar 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+