For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1985 భారత జట్టు కోహ్లీసేనను కూడా ఇబ్బందిపెట్టగలదు: ర‌విశాస్త్రి

Ravi Shastri said Indias team of 1985 could trouble Current Virat Kohlis side in limited overs

ముంబై: 1985 భారత జట్టు ప్రస్తుత విరాట్ కోహ్లీ జట్టును కూడా ఇబ్బందిపెట్టగలదు అని టీమిండియా చీఫ్ కోచ్ ర‌విశాస్త్రి అన్నాడు. ప్ర‌స్తుత టీమిండియాకు పోటీనివ్వ‌గ‌ల‌ద‌ని అభిప్రాయపడ్డాడు. ఆ జ‌ట్టులో అనుభ‌వ‌జ్ఞులు, యువ‌కులు స‌రి స‌మానంగా ఉండేవార‌ని.. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఆ జ‌ట్టు ప్ర‌పంచంలోనే ఏ జ‌ట్టునైనా ఓడించ‌గ‌లద‌ని శాస్త్రి విశ్వాసం వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం టీమిండియాకు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌విశాస్త్రి.. 1985 జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్‌గా సేవ‌లందించిన విష‌యం తెలిసిందే.

ఏ జ‌ట్టుకైనా పోటీ ఇవ్వ‌గ‌ల‌దు

ఏ జ‌ట్టుకైనా పోటీ ఇవ్వ‌గ‌ల‌దు

సోనీ టెన్ పిట్ స్టాప్ షోలో ర‌విశాస్త్రి మాట్లాడుతూ... 'నా వ‌ర‌కైతే 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టుక‌న్నా.. 1985 జట్టే చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. అందులో అనుభ‌వ‌జ్ఞుల‌తో పాటు యువ‌కులు కూడా ఉన్నారు. ఆ రెండు జ‌ట్ల‌లో నేను భాగ‌స్వామినే. అందుకే ఈ మాట‌లు అంటున్నా. లిటిల్ మాస్టర్ సునీల్ గ‌వాస్క‌ర్ నేతృత్వంలో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ ఆఫ్ క్రికెట్ నెగ్గిన జ‌ట్టు.. ప్ర‌స్తుతం విరాట్ అండ్ గ్యాంగ్‌కు కూడా పోటీనివ్వ‌గ‌ల‌దు' అని అన్నాడు.

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం విశేషం

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం విశేషం

'71 సంవత్సరాల తర్వాత తొలిసారిగా 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం విశేషం. అందులో నేను భార‌త హెడ్‌కోచ్ అవ్వడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆసీస్ జట్టును ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ జట్టును 71 ఏళ్లలో ఏ ఆసియా జట్టు కూడా ఓడించలేదు. ఆసీస్ గడ్డకు వెళ్లిన చాలామంది సిరీస్ గెలవాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఏదేమైనా వైట్ బాల్ క్రికెట్లో 1985ను ఓడించలేరు' అని ర‌విశాస్త్రి పేర్కొన్నాడు. ఆ చాంపియ‌న్‌షిప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచినందుకు గాను ర‌విశాస్త్రి ఆడీ కార్‌ను బ‌హుమ‌తిగా పొందిన విష‌యం తెలిసిందే.

మియాందాద్ తీవ్రంగా ప్రయత్నించాడు

మియాందాద్ తీవ్రంగా ప్రయత్నించాడు

ఆస్ట్రేలియా వేదికగా 1985లో జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఉన్న ఆడి కారు కోసం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ తీవ్రంగా ప్రయత్నించాడని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. 'పాకిస్థాన్‌‌ను ఆ మ్యాచ్‌లో ఓడించడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. నిజాయితీగా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచేందుకు మియాందాద్ చాలా ప్రయత్నించాడు. కానీ.. అతనికి ఆడీ కారు గెలుచుకునే అవకాశం దక్కలేదు. సిరీస్‌లో అతని ప్రదర్శన ఒకానొక దశలో రోమాలు నిక్కబొడుచుకునేలా కనిపించింది' అని శాస్త్రి తెలిపాడు.

రోజర్, శివతో కలిసి తాగుతా

రోజర్, శివతో కలిసి తాగుతా

తాజాగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో కొన్ని సండలింపులు ఇస్తూ కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వం వైన్‌షాప్స్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. రవిశాస్త్రి ప్రస్తుతం అలీబౌగ్‌లో ఉండగా.. అది ఆరేంజ్ జోన్‌లో ఉంది. దీంతో తాను వైన్ షాప్‌కు వెళ్లి బీర్ తెచ్చుకుంటానని ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు. 'లాక్‌డౌన్‌లో నేను ఉన్న ప్రాంతం అలీబౌగ్ తొలుత రెడ్ జోన్‌లో ఉండేది.. ఇప్పుడు ఆరెంజ్ జోన్ అయింది. షాపులు తెరవగానే బీర్ తెచ్చుకుంటాను. ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం నాకే ఉంటే.. రోజర్, శివతో కలిసి తాగుతాను' అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, May 6, 2020, 17:29 [IST]
Other articles published on May 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+