Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరైన సమయంలో భారత్‌కు వచ్చాం.. ఊహించడానికే భయంగా ఉంది: రవిశాస్త్రి

Ravi Shastri said India cricketers knew there could be a hold up in sports due coronavirus


ముంబై:
న్యూజిలాండ్‌ పర్యటన నుండి సరైన సమయంలోనే భారత్‌కు వచ్చాం అని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న సమయంలో, భారత్‌లో వ్యాప్తిచెందుతున్న వేళ న్యూజిలాండ్‌ పర్యటన నుంచి భారత్ తిరిగొచ్చిందని చెప్పాడు. మార్చి రెండో వారంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సమయంలో క్రీడలు స్తంభించిపోయే అవకాశం ఉందని భారత క్రికెటర్లకు తెలుసన్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌ వాయిదా:

దక్షిణాఫ్రికా సిరీస్‌ వాయిదా:

న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ పర్యటన అనంతరం మార్చి తొలి వారంలో స్వదేశానికి చేరుకున్న టీమిండియా మార్చి 12 నుంచి 18 వరకు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే రద్దైంది. ఇక దేశంలో అప్పటికే కరోనా కోరలు చాస్తుండడంతో రెండో మ్యాచ్‌కు ముందు సిరీస్‌ను వాయిదా వేశారు.

సరైన సమయంలో భారత్‌కు వచ్చాం:

సరైన సమయంలో భారత్‌కు వచ్చాం:

తాజాగా స్కై క్రికెట్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే దక్షిణాఫ్రికా సిరీస్‌కు సిద్ధమవుతున్నప్పుడే వైరస్‌ ప్రభావాన్ని పసిగట్టాం. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసి ఏదో జరుగుతుందని ఊహించాం. రెండో వన్డే రద్దు కాగానే లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితి తప్పదనిపించింది. వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందని భారత క్రికెటర్లు న్యూజిలాండ్‌లోనే ఊహించారు. సింగపూర్‌ నుంచి రావడంతో కాస్త ఆందోళన పడ్డారు. కానీ.. ఇక్కడ దిగేసరికి ఊపిరిపీల్చుకున్నారు. సరైన సమయంలోనే వచ్చేశామని అనుకున్నాం. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇక్కడికి వచ్చిన రోజు నుంచే ప్రజలను స్క్రీనింగ్‌ చేయడం మొదలెట్టారు' అని తెలిపాడు.

 క్రికెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు:

క్రికెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు:

'కరోనాతో ఏర్పడిన ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరి దృష్టి ఆరోగ్య భద్రతపైనే ఉండాలి. క్రికెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తమ ఒక్కరి భద్రతే కాకుండా ప్రజల భ్రదత గురించి కూడా ఆలోచించాలి. అందరికీ వైరస్‌ ప్రభావంపై అవగాహన కల్పించాలి. ఈ విషయంలో టీమిండియా ఆటగాళ్లు ముందున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో సహా చాలా మంది ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల్లో ఇంకా చైతన్యం కల్గించాల్సిన అవసరం ఉంది' అని రవిశాస్త్రి అన్నాడు.

 స్తంభించిపోయిన క్రీడా ఈవెంట్లు:

స్తంభించిపోయిన క్రీడా ఈవెంట్లు:

మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఏ దేశంలో కూడా ఆటలు జరగట్లేదు. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ఒలింపిక్స్‌ సైతం ఏడాది వాయిదా పడింది. ఇక భారత్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 15కు వాయిదా పడ్డ ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజా సమాచారం ప్రకారం టీ20 ప్రపంచకప్ జరగడం కూడా అనుమానంగానే ఉంది.

Story first published: Saturday, March 28, 2020, 12:19 [IST]
Other articles published on Mar 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+