
హైదరాబాద్: ఇద్దరు మహిళలతో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వరల్డ్‌కప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్ మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫొటో వైరల్ కావడంతో రవిశాస్త్రిపై విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్‌మాన్ ఈ ఫొటోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసి "ఇండియా వరల్డ్‌కప్ సన్నాహాలు చాలా బాగా సాగుతున్నట్టున్నాయి" అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.
అంతేకాదు ఈ ఫొటోలో మరో వ్యక్తి ఉన్నాడు. అయితే, భారత క్రికెట్ జట్టుతో అతడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవిశాస్త్రిని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. 'బహుశా! ఇందువల్లనే అధికారిక ప్రెస్‌మీట్‌కు రాలేదనుకుంటా' అని నెటిజన్ కామెంట్ పెట్టాడు.
మరొక నెటిజన్ అయితే "షేన్‌వార్న్ కంటే రవిశాస్త్రి మంచి ప్లేబాయ్‌ఠ అంటూ కామెంట్ చేశారు. 'ఫీల్డింగ్ ఎట్ ఫైన్ లెగ్' అంటూ ఇంకొక నెటిజన్ కామెంట్ పెట్టగా... రవిశాస్త్రి ఎవరో తెలియకపోతే అజహర్ సినిమాను మరోసారి చూడాలని యువతులకు పాకిస్తాన్ అభిమాని ఒకరు సూచించారు.