ఎవరికి లాభమో తెలియడం లేదు: రోహిత్‌తో విభేదాలపై స్పందించిన కోహ్లీ

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ సమావేశంలో రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కోహ్లీ పేర్కొన్నాడు. "డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కీలకమైంది. మా సక్సెస్‌కు అదే కారణం. ఒకవేళ మీరన్నట్టుగా రోహిత్‌తో విభేదాలు ఉన్నట్లు నిజమే అయితే, అప్పుడు మేం ఇంత గొప్పగా ఆడేవాళ్లం కాదు" అని కోహ్లీ వెల్లడించాడు.
ఒక వ్యక్తి నాకు నచ్చకపోతే
"ఒక వ్యక్తి నాకు నచ్చకపోతే.. దానిని మీరు నా ముఖంలోనో, నా ప్రవర్తనలోనూ చూస్తారు. రోహిత్‌ను నేను ప్రతిసారి మెచ్చుకున్నానని, అతనో గొప్ప ప్లేయర్ అని, మా ఇద్దరి మధ్య ఎటువంటి సమ్యలు లేవని, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావడం లేదని, మా ఇద్దరి మధ్య గొడవ సృష్టించడం వల్ల ఎవరు లాభపడుతారో తెలియదు" అని కోహ్లీ అన్నాడు.
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు
మరోవైపు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నట్లు వాస్తున్న వార్తలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం స్పందించాడు. ఒకవేళ అదే నిజమైతే మూడు ఫార్మాట్లలోనూ ఒకే రకమైన నిలకడ ప్రదర్శన కుదరదని అన్నాడు. ఆ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని రవిశాస్త్రి తెలిపాడు.

రోహిత్-కోహ్లీ విభేదాలకు కారణం
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్యన వివాదానికి కారణమైందని వార్తలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపడంతో సహా మరికొన్ని నిర్ణయాలపై కెప్టెన్‌పై రోహిత్ తీవ్రంగా మనస్థాపం చెందడం... ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని వార్తలు హల్ చల్ చేశాయి.

రోహిత్‌తో స్పష్టతనిచ్చిన కోహ్లీ
ఈ వార్తలపై వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరడానికి ముందు విరాట్ కోహ్లీ స్పష్టత నిచ్చాడు. కాగా, వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. తొలి రెండు టీ20లు ప్లోరిడా వేదికగా జరగనున్నాయి. ఆగస్టు 3న ఇరు జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications