కోహ్లీ ఎద్దులా పని చేస్తున్నాడు: రవి శాస్త్రి

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో యూఏఈ వేదికగా జరిగిన టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కోహ్లి రెస్ట్ ఇవ్వడంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు. అసలు కోహ్లి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందో అనే విషయంపై వివరణ ఇచ్చాడు.

శారీరకంగా చూస్తే కోహ్లి ఒక ఎద్దులా
‘కోహ్లి చాలా అలసిపోయాడు. శారీరకంగా చూస్తే కోహ్లి పరిస్థితి ఒక ఎద్దులా మారిపోయింది. దాంతో కోహ్లి విశ్రాంతి అనివార్యమైంది. ఒకవేళ ఆసియాకప్‌లో అతను ఆడితే అది తీవ్రమైన ప్రభావం చూపేది. గత కొంతకాలంగా విరామంగా లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లి మరింత తాజాగా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే అతనికి విశ్రాంతినిచ్చాం. ఇక్కడ కోహ్లికి ఒక్కడికే కాదు.. మిగతా ఆటగాళ్ల విషయం కూడా అదే పద్ధతిని అవలంభిస్తున్నాం.' అని పేర్కొన్నాడు.

విండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి పక్కకు
'పేసర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు సైతం విశ్రాంతి అవసరమని భావించే వారిని విండీస్‌తో టెస్టు సిరీస్ నుంచి పక్కకు పెట్టాం. విరామం లేకుండా క్రికెట్ ఆడేవారు మరింతగా రాటుదేలాలంటే విశ్రాంతి అనేది అనివార్యం' అని టీమిండియా హెడ్ కోచ్ వివరణ ఇచ్చాడు.

నేనేం చేయాలనుకున్నానో అదే ట్వీట్ చేస్తా
కెప్టెన్ కోహ్లీకి మద్దతిస్తూనే తనపై సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్ల గురించి స్పందించాడు. తాను చాలా బిజీగా ఉంటానని ఆ సమయంలో ఒకట్రెండు పేపర్‌లు చదువుతానని తెలిపాడు. ఆ ట్వీట్లు చదివే తీరిక తమకు ఉండదని కేవలం తానేం చేయాలనుకుంటాడో అదే ట్వీట్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20లు
ఆసియా కప్ విజయం తర్వాత రవిశాస్త్రి టీమిండియా మరో విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా చుట్టేయనుంది. ఈ క్రమంలో జట్టుతో పాటుగా రవిశాస్త్రి వెళ్తాడా అనేది నిర్ణయించే క్రమంలో బోర్డు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో 3వన్డేలు, 4 టెస్టులు, 3 టీ20ల్లో భారత్ పాల్గొననుంది. అయితే ఈ పర్యటనలో విజయం సాధించడానికి తాను మరింత ఫోకస్‌ను పెంచుతానని హెడ్ కోచ్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications