For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi Shastri Records: శకం ముగిసింది.. ఆ ఒక్కటి తప్పిస్తే కెరీర్ సూపర్! కోచ్‌గా రవిశాస్త్రి రికార్డులు ఇవే!!

Ravi Shastri Records As Indian Head Coach: Ends His Career Without Winning ICC Trophy

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ పూర్తిగా నిరాశపర్చింది. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే కోహ్లీసేన ఇంటిదారిపట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయాల తర్వాత అఫ్గనిస్థాన్‌, స్కాట్లాండ్‌, మీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా కోహ్లీసేన సెమీస్‌కు చేరుకోలేకపోయింది. దాంతో భారత జట్టుకు సుదీర్ఘకాలం కోచ్‌గా వ్యవహరించి పొట్టి ప్రపంచకప్‌తో బాధ్యతల నుంచి వైదొలిగిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి నిరాశే ఎదురైంది. టైటిల్ అందుకుని అతడికి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలనుకుంటే.. సెమీస్ చేరకుండానే భారత్ నిష్క్రమించింది.

ఐసీసీ ట్రోఫీ లేదు

ఐసీసీ ట్రోఫీ లేదు

రవిశాస్త్రి 4 సంవత్సరాలు టీమిండియాకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఈ సమయంలో అతను అనేక చారిత్రక విజయాలు సాధించాడు. శాస్త్రి హయాంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలువలేకపోయినా.. ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. టెస్ట్, వన్డే, టీ20ల్లో అద్భుత విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ చేజిక్కించుకోవడం.. రెండేంళ్ల తర్వాత బలహీన జట్టుతోనే దాన్ని నిలబెట్టుకోవడం విశేషం. ఇంగ్లండ్‌ గడ్డపై ఒకే సిరీస్‌లో రెండు టెస్టులు నెగ్గడం.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్‌లు గెలువడం ఇలా లెక్కకు మిక్కిలి విజయాలు నమోదు చేసుకుంది.

183 మ్యాచుల్లో 118 విజయాలు

183 మ్యాచుల్లో 118 విజయాలు

రవిశాస్త్రి 4 సంవత్సరాల హయాంలో భారత్ 43 టెస్టులు ఆడగా.. 25 మ్యాచులు గెలుచుకుంది. 13 టెస్టుల్లో ఓడగా.. ఐదు డ్రా అయ్యాయి. 76 వన్డేల్లో 51 విజయాలు, 25 ఓటములను భారత్ ఎదుర్కొంది. ఇక 64 టీ20ల్లో భారత్ 42 విజయాలను సాధించగా.. 18 మ్యాచుల్లో ఓటమిపాలైంది. మొత్తంగా రవిశాస్త్రి కోచ్‌గా ఉండగా భారత్ అన్ని ఫార్మాట్‌లలో కలిపి 183 మ్యాచులు ఆడింది. ఇందులో 118 విజయాలు, 53 ఓటములు ఉన్నాయి. మరో ఐదు మ్యాచులు డ్రా అయ్యాయి. అయితే రవిశాస్త్రి హయాంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం పెద్ద లోటనే చెప్పాలి. 2019 ప్రపంచకప్‌లో, 2021 టెస్ట్ ఛాంపియన్ షిప్‌లను తృటిలో చేజార్చుకుంది.

4వ నంబర్‌కు సరైన ఆటగాడిని వెతకలేదు

4వ నంబర్‌కు సరైన ఆటగాడిని వెతకలేదు

ప్రత్యర్థి ఎవరైనా భయం లేకుండా బరిలోకి దిగి సత్తాచాటాలనే తన దృక్పథాన్ని రవిశాస్త్రి.. ఆటగాళ్లలో బలంగా తీసుకెళ్లగలిగాడు. పక్కా వ్యూహాలు, పదునైన మాటలతో ఉత్తేజం నింపాడు. అయితే శాస్త్రి టీమిండియాకు 4వ నంబర్‌కు బ్యాట్స్‌మన్ ఫిక్స్ చేయడంలో విఫలమయ్యాడు. 2019 ప్రపంచకప్‌కు ముందు అంబటి రాయుడిపై నమ్మకం పెట్టుకోకుండా తొలగించారు. రాయుడు స్థానంలో విజయ్ శంకర్ ఆడాడు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ వంటి బ్యాట్స్‌మెన్‌లు ఈ స్థానంలో విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం లభించింది. అయితే గాయంతో ఈ ఆటగాడు తన స్థానాన్ని కోల్పోయాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ టీమిండియాకు ఇంకా ఆందోళన కలిగిస్తోందనడంలో సందేహం లేదు.

రవిశాస్త్రి రికార్డులు

# ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ (2018-19) చేజిక్కించుకొని.. కంగారూల దేశంలో టెస్టు సిరీస్‌ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా భారత్‌ నిలిచింది.

# 2020-21 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ అందుబాటులో లేకున్నా.. ఉన్న ఆటగాళ్లలోనే ఆస్ట్రేలియాను ఖంగు తినిపించి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకుంది.

# వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో రన్నరప్‌గా నిలిచింది.

# ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు చేరింది.

# ఈ ఏడాది ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఆడిన నాలుగు టెస్టుల్లో 2-1తో ముందంజ.

# రవిశాస్త్రి హయాంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లు భారత్ నెగ్గింది.

# 2017లో శ్రీలంకను 3-0తో వైట్‌వాష్‌ చేసింది.

# రవిశాస్త్రి హయాంలోనే భారత బౌలింగ్‌ ప్రపంచ అత్యుత్తమ దళంగా ఎదిగింది.

# ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 42 వారాల పాటు (2016 నుంచి 2020) భారత జట్టు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగింది.

Story first published: Tuesday, November 9, 2021, 8:59 [IST]
Other articles published on Nov 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+