న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్-ఇండియా సిరీస్.. పొట్ట విన్నర్ రవిశాస్త్రియే

Ravi Shastri Gets Funny Comments From His Fans
Ravi Shastri pot belly becomes the jokes on Twitter

హైదరాబాద్: ఎమోషనల్‌గా మీడియా సమావేశంలో ముచ్చటించే రవిశాస్త్రిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇలా మరోసారి టీమిండియా కోచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా రవిశాస్త్రి మైదానంలో నిలుచొన్న ఉన్న ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో రవిశాస్త్రి పొట్ట కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో అతడి ఫిట్‌నెస్‌‌పై సెటైర్లు పడిపోతున్నాయి. ఆటగాడిగా ఉన్నప్పుడు రవిశాస్త్రి ఫిట్‌నెస్‌ బాగానే ఉండేది. టీమిండియా కోచ్‌‌గా మారినా.. రవిశాస్త్రి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం లేదు. ఆటగాళ్లు ఫిట్‌‌గా ఉండాలంటాడే కానీ... అతను మాత్రం బాడీ మీద బ్యాలెన్స్ కోల్పోయాడు.

1
42375

రవిశాస్త్రి పొట్ట మీద పంచ్‌‌లు

ఇప్పుడు రవిశాస్త్రి పొట్టపై పంచ్‌ల మీద పంచ్‌‌లు వేస్తున్నారు నెటిజన్లు. భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టులో భాగంగా గ్రౌండ్‌లో నిలిచొన్న రవిశాస్త్రి పొట్టను చూపిస్తూ.. డెలివరీకి సిద్ధంగా ఉన్నాడంటూ కొందరు జోకులు వేస్తున్నారు. కోచ్‌‌కూ యోయో టెస్ట్‌ పెట్టాలేమో అని మరికొందరు విమర్శలు సంధింస్తున్నారు.

పొట్టను పెంచడం నేరం కాదులే..

పొట్టను పెంచడం నేరమీమీ కాదని.. అయితే డైటింగ్ చేయడం అవసరమని మరొకరు ట్వీట్ చేశారు. లార్డ్స్‌‌ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. బెల్లీ విన్నర్ మాత్రం రవిశాస్త్రే అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కోచ్‌ పొట్టను టీమిండియా కెప్టెన్‌ ఆశ్చర్యకరంగా చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోను పెట్టి.. చిత్రవిచిత్రమైన కామెంట్లను అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

టీమిండియా హెడ్‌ కోచ్‌.. ఓ తాగుబోతు

కాగా, కొద్ది రోజుల క్రితం టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఓ తాగుబోతు అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీనికి సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి పోస్టు చేసిన వీడియోనే కారణం. ఓ ఎనర్జీ డ్రింక్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఓ వీడియోను రవిశాస్త్రి తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ రోజు లండన్‌లో చాలా వేడిగా ఉంది. ఈ డ్రింక్‌ తాగి వేడి నుంచి ఉపశమనం పొందండి' అంటూ పేర్కొన్నాడు.

మ్యాచ్‌ జరిగే సమయంలో నిద్రపోతూ..:

లార్డ్స్‌ టెస్టులో ఎలా గెలవాలన్న దానిపై జట్టుకు సలహాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నావని, తామంతా భారత విజయం కోసం ఎదురు చూస్తున్నామని ఒకరు మండిపడగా.. అసలు నువ్వు కోచ్‌వేనా అని ఇంకొకరు ప్రశ్నించారు. కోచ్‌గా రవిశాస్త్రి జట్టు కోసం ఏం చేస్తున్నాడని మొన్న మ్యాచ్‌ జరిగే సమయంలో నిద్రపోతూ కనిపించాడని.. ఇప్పుడేమో ఇలా ప్రమోషనల్స్‌ అంటూ తిరుగుతున్నాడని మండి పడ్డారు.

Story first published: Friday, August 10, 2018, 12:18 [IST]
Other articles published on Aug 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X