For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ప్రశ్నించను, మీరు ఫిర్యాదులు చేయకండి: పిచ్‌పై శాస్త్రి వివాదం

By Nageshwara Rao
Ravi Shastri Speaks On Down Tour Game Controversy
Ravi Shastri plays down tour game controversy: We will play on any surface, conditions

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఇంగ్లీషు గడ్డపై టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ తమ ముందున్న సవాల్‌ ప్రత్యర్థిని ఓడించడమేనని, ఈ పర్యటనలో ఫలితాలకు వాతావరణం, పిచ్‌లను కారణంగా చూపబోమని అన్నాడు.

పిచ్‌, ఔట్‌ ఫీల్డ్‌ చెత్తగా ఉండటంతో, అసంతృప్తితో టీమిండియా ఎసెక్స్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను మూడు రోజులకు తగ్గించుకుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా గొప్పగా ఆడి, ఉత్తమ జట్టుగా నిలవడాన్ని గర్వంగా భావిస్తామని అన్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌ ఏర్పాట్లు సరిగా లేకపోవడం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు.

మీ దేశంలో నేను ప్రశ్నించను

మీ దేశంలో నేను ప్రశ్నించను

"నా సిద్ధాంతం ఒకటే. మీ దేశంలో నేను ప్రశ్నించను. మా దేశంలో మీరెలాంటి ఫిర్యాదులు చేయకండి. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉంది తొలగించాలా అన్నప్పుడు గ్రౌండ్స్‌మన్‌కు నేనిలా చెప్పాను. దీనిని ఇంతటితో మర్చిపొమ్మని చెప్పా, పిచ్‌, పరిస్థితుల గురించి ఈ పర్యటనలో భారత జట్టు నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవడమే మా ముందున్న సవాల్‌" అని అన్నాడు.

ఎక్కడైనా గెలవడాన్ని మేం గర్వంగా భావిస్తాం

ఎక్కడైనా గెలవడాన్ని మేం గర్వంగా భావిస్తాం

"ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక జట్టుగా నిలవాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా గెలవడాన్ని మేం గర్వంగా భావిస్తాం. ప్రపంచంలో ఫిర్యాదు చేసే జట్లలో మాదే ఆఖరి జట్టు అవుతుందన్నది స్పష్టం చేస్తున్నా'' అని రవిశాస్త్రి తెలిపాడు. ఎసెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం సిద్ధం చేసిన పిచ్‌పై ఎక్కువ మొత్తంలో పచ్చిక ఉంది. దీనిపై సూచనలు చేయలేదా అన్న ప్రశ్నకు శాస్త్రి ఈ విధంగా స్పందించాడు.

ఎస్సెక్స్‌తో మ్యాచ్‌కు పిచ్‌పై చిక్కటి పచ్చిక ఉంది

"ఎస్సెక్స్‌తో మ్యాచ్‌కు పిచ్‌పై చిక్కటి పచ్చిక ఉంది. మీరు కోరితే దానిని తొలగిస్తాం అని గ్రౌండ్స్‌మెన్‌ చెప్పారు. అయినా నేను వద్దని కచ్చితంగా చెప్పా. మీరు ఇచ్చే దానిపై మేం ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. మా దేశానికి వచ్చినప్పుడు మీరు కూడా పిచ్‌ల గురించి ప్రశ్నించొద్దని సూచించా" అని అన్నాడు. వేడి గాలుల కారణంగానే తాము ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను మూడు రోజులకు కుదించుకున్నామని తెలిపాడు.

వార్మప్ మ్యాచ్‌లో ఒక రోజు కుదింపుపై

వార్మప్ మ్యాచ్‌లో ఒక రోజు కుదింపుపై

"వార్మప్ మ్యాచ్‌లో ఒక రోజు కుదింపుపై మంగళవారం ప్రాక్టీస్‌ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం. రెండు రోజుల మ్యాచ్‌ ఆడటమూ మాకు సంతోషకరమే. అయితే ఎస్సెక్స్‌ స్టేడియం అధికారులు తాము టికెట్లు విక్రయించిన సంగతితో పాటు అన్ని వివరాలు తెలిపారు. దీంతో మూడు రోజుల మ్యాచ్‌ ఆడేందుకు ఒప్పుకొన్నాం. వాతావరణం, ఇతర కారణాలతో సన్నాహక మ్యాచ్‌లో ఒక రోజు పోయినా మొదటి టెస్టు జరిగే బర్మింగ్‌హామ్‌లో మా ప్రాక్టీస్‌కు మూడు రోజుల సమయం దొరుకుతుంది" అని రవిశాస్త్రి అన్నాడు.

 ఎడ్జ్‌బాస్టన్‌లో ఒక సెషన్‌ అయినా ప్రాక్టీస్ చేయాలి

ఎడ్జ్‌బాస్టన్‌లో ఒక సెషన్‌ అయినా ప్రాక్టీస్ చేయాలి

"ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో ఒక సెషన్‌ అయినా ప్రాక్టీస్ చేయాలన్నది మా అసలు ఉద్దేశం. ఇక్కడ మేం ఒక రోజు అదనంగా ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు. పైగా నాలుగు రోజులు ఆడితే... బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం కారణంగా ఒక రోజును కోల్పోయేవాళ్లం. ఈ వ్యవధిని మొదటి టెస్టు జరిగే చోట గడిపితే మాకు వేదికతో పాటు పరిస్థితులపై అవగాహన వస్తుంది" అని తెలిపాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత తొలి టెస్టు బర్మింగ్‌హమ్‌ వేదికగా ఆగస్టు 1న ఆడనుంది.

Story first published: Thursday, July 26, 2018, 10:35 [IST]
Other articles published on Jul 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+