న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు పంత్‌ను తీసుకుంటా.. సెమీఫైనల్‌పై మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్

Ravi Shastri picks Rishabh Pant over Dinesh Karthik for the Semifinal clash against England

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్యాదవ్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా సెమీస్ కూడా చేరింది. బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో తెగ చర్చ జరుగుతోంది.

సెమీస్ చేరిన భారత్..

సెమీస్ చేరిన భారత్..

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై గెలిచి, సౌతాఫ్రికా చేతిలో ఓడింది. చివరగా బంగ్లాదేశ్, జింబాబ్వే మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది. అంతకుముందు నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో భారత్ సెమీస్ చేరింది. అనంతరం జింబాబ్వేపై విజయంతో గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగు పెట్టింది.

డీకే వర్సెస్ పంత్..

డీకే వర్సెస్ పంత్..

ఆడిన తొలి మూడు మ్యాచుల్లో భారత జట్టు రాణించినా.. స్పెషలిస్టు ఫినిషర్‌గా జట్టులోకి తీసుకున్న దినేష్ కార్తీక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా కూడా రాణించని డీకే.. వికెట్ కీపింగ్‌లో కూడా పలుసార్లు విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో యువ కీపర్ రిషభ్ పంత్‌ను తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. అతను కూడా టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు పెద్దగా రాణించింది లేదు. జింబాబ్వే మ్యాచ్‌లో అవకాశం వచ్చినా 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు పంత్.

రవిశాస్త్రి ఏమన్నాడంటే..

రవిశాస్త్రి ఏమన్నాడంటే..

డీకే, పంత్‌లలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే ప్రశ్నపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. 'దినేష్ కార్తీక్ మంచి టీం ప్లేయర్. కానీ ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ ఎటాక్‌ను చూస్తే.. నిలకడైన, ఎడం చేతి వాటం బ్యాటింగ్ చేసే మ్యాచ్ విన్నర్ జట్టుకు చాలా అవసరం. ఇంతకుముందు కూడా ఇంగ్లండ్‌పై పంత్ బాగా రాణించాడు. చివరగా ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. అందుకే నేనైతే పంత్‌ను తీసుకుంటాను. అతను జట్టులో కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొస్తాడు' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, November 8, 2022, 10:55 [IST]
Other articles published on Nov 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X