హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి మూడు నెలల కాలానికి గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 1.20 కోట్లు చెల్లింపులు చేసింది. ఈ ఏడాది జులైలో కోచ్‌గా నియమితులైన రవి శాస్త్రి మూడు నెలలకు గాను ఈ మొత్తాన్ని అందుకున్నారు.
జూలై 18 నుంచి అక్టోబర్ 18 మధ్య కాలానికి ఆయనకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. విదేశాల్లో ఆడిన టోర్నీల ద్వారా లభించిన ఆదాయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర ధోనికి అతని వాటాగా రూ. 57.88 లక్షలు బీసీసీఐ చెల్లించింది.

మరోవైపు ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఖాతాలో రంజీ ట్రోఫీ నిర్వహించినందుకు గానూ రూ. 69 లక్షలు, విజయ్ హజారే ట్రోఫీ నిర్వహణకు రూ. 56 లక్షలను బీసీసీఐ జమ చేసింది.