న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ ధోనీకి ఎంతో కీలకం.. ఆ ప్రదర్శనతోనే మహీ భవితవ్యం తేలనుంది: రవిశాస్త్రి

MS Dhoni Future Depends On IPL Performance - Ravi Shastri
Ravi Shastri opines on the future of MS Dhoni

ఆక్లాండ్‌: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్‌-13 సీజన్ ఎంతో కీలకం. ఐపీఎల్‌ ప్రదర్శనతోనే మహీ భవితవ్యం తేలనుంది అని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌ 2019 అనంతరం ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

<strong>చెలరేగిన టీమిండియా బౌలర్లు.. రెండో టీ20లో చేతులెత్తేసిన కివీస్.. భారత్‌ లక్ష్యం 133</strong>చెలరేగిన టీమిండియా బౌలర్లు.. రెండో టీ20లో చేతులెత్తేసిన కివీస్.. భారత్‌ లక్ష్యం 133

రీఎంట్రీపై అనుమానాలు:

రీఎంట్రీపై అనుమానాలు:

ఇటీవలే బీసీసీఐ 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించగా.. అందులోనూ ధోనీకి కాంట్రాక్ట్‌ని ఇవ్వలేదు. దీంతో మహీ మళ్లీ భారత్ జట్టు తరఫున ఆడటం అనుమానమేనంటూ వార్తలు వచ్చాయి. కొందరూ ధోనీ రీఎంట్రీ పక్కా అంటుంటే.. మరికొందరూ కెరీర్‌ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహీ భవితవ్యంపై రవిశాస్త్రి మరోమారు స్పందించాడు.

ఐపీఎల్‌ ప్రదర్శనతోనే భవితవ్యం తేలనుంది:

ఐపీఎల్‌ ప్రదర్శనతోనే భవితవ్యం తేలనుంది:

న్యూజిలాండ్‌తో తొలి టీ20 విజయానంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'ఐపీఎల్-13 సీజన్ ధోనీకి ఎంతో కీలకం. ఈ విషయం సెలెక్టర్లు, కెప్టెన్‌తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. మహీ తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు. అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం. ఐపీఎల్‌కు సంబంధించి ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో తెలియదు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనతోనే మహీ భవితవ్యం తేలనుంది. ఒకవేళ ఐపీఎల్‌లో తన ఆటతో మెప్పించలేకపోతే ధోనీనే తప్పుకుంటాడు' అని తెలిపాడు.

రంజీ జట్టుతో ప్రాక్టీస్‌:

రంజీ జట్టుతో ప్రాక్టీస్‌:

బీసీసీఐ తనను కాంట్రాక్ట్‌ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ వైట్‌బాల్‌తో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు. ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ దేవాలయం 'డియోరి'లో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ ఐపీఎల్‌ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టినట్లు సమాచారం. ఇటీవలే ధోనీ డియోరి దేవాలయంకు వెళ్లి పూజలు చేసాడట.

Story first published: Sunday, January 26, 2020, 15:05 [IST]
Other articles published on Jan 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X