Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్ కోహ్లీనే అల్టిమేట్ బాస్: కోచ్‌గా తన పరిధి తెలుసన్న రవిశాస్త్రి

హైదరాబాద్: జట్టు విజయాలు సాధించాలంటే కెప్టెన్, కోచ్ మధ్య సత్సంబంధాలు చాలా అవసరమని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అనిల్ కుంబ్లే రాజీనామా అనంతరం ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి తనదైన శైలిలో జట్టుకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

జట్టులో ఎంతో మార్పుని తీసుకొచ్చిన శాస్త్రి

జట్టులో ఎంతో మార్పుని తీసుకొచ్చిన శాస్త్రి

అంతేకాదు గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులోనే ఆటగాళ్ల తీరులో ఎంతో మార్పుని తీసుకొచ్చాడు. మురళీ విజయ్ గాయం కారణంగా కొన్ని నెలల తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న శిఖర్ ధావన్ గాలే టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ చేయగా, ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న కోహ్లీ సైతం సెంచరీతో రాణించేలా చేశాడు.

డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకి స్వేచ్ఛ

డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకి స్వేచ్ఛ

ముఖ్యంగా డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకి స్వేచ్ఛనిస్తూ తనదైన శైలిలో కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు.

కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి ఇలా

కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి ఇలా

కెప్టెన్, కోచ్ ఇద్దరూ ఒకే తరహా ఆలోచన కలిగి ఉండాలా? ఒకవేళ లేకపోతే ఎవరు సర్దుకోవాలి అని రవిశాస్త్రినిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘కోచ్, కెప్టెన్ మధ్య సత్సంబంధాలు చాలా అవసరం. ఇవి ఏమాత్రం చెడినా, జట్టు ప్రదర్శన దెబ్బ తింటుంది. నా వరకు తీసుకుంటే. కోహ్లీతో నాకు మంచి అనుబంధం ఉంది' అని చెప్పాడు.

కెప్టెన్ కోహ్లీనే అల్టిమేట్ బాస్

కెప్టెన్ కోహ్లీనే అల్టిమేట్ బాస్

'గతంలో నేను 18 నెలల పాటు టీమిండియాతో కలిసి పనిచేయడం కలిసొచ్చింది. కోచ్‌గా నా పరిధి ఏంటో నాకు తెలుసు. ఇక్కడ కెప్టెన్ అల్టిమేట్ బాస్.. అతని నిర్ణయమే అంతిమం. ఎందుకంటే అతనే కదా.. జట్టుని మైదానంలోకి తీసుకెళ్లి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేది. కోచ్‌గా నేను వారిని స్వేచ్ఛగా ఆడేందుకు, ఉత్సాహం ఉండేందుకు మాత్రమే సలహాలు, సూచనలు ఇవ్వగలను. అంతేగానీ.. మైదానంలోకి బ్యాట్‌తో వెళ్లలేను కదా? కాబట్టి నా పని ఏంటంటే మ్యాచ్‌ కోసం జట్టును సిద్ధం చేయడమే. ఆ తర్వాత మొత్తం కెప్టెనే చూసుకుంటాడు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+