తప్పు మీద తప్పులు చేస్తే కఠిన నిర్ణయాలు తప్పవు: పంత్‌కు శాస్త్రి వార్నింగ్

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ మ్యాచ్‌లో తొలి బంతికే రిషబ్ పంత్ ఔటైన సంగతి తెలిసిందే. అలాంటి చెత్త షాట్ మళ్లీ రిపీట్ అయితే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయని అతడితో చెప్పినట్లు హెడ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బలమైన జట్టుని రూపొందించే క్రమంలో జట్టు మేనేజ్‌మెంట్ పంత్‌కు పదే పదే అవకాశాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే, రిషబ్ పంత్ వాటిని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం పంత్ పెద్దగా రాణించలేదు. అంతేకాదు ఎప్పుడూ ఒకే తరహా షాట్‌కు ఔట్ కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో పంత్ షాట్ సెలక్షన్‌పై మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

డీప్ స్వేర్ లెగ్‌లో పంత్ ఔటవుతున్న తీరు
ముఖ్యంగా డీప్ స్వేర్ లెగ్‌లో పంత్ ఔటవుతున్న తీరు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను తప్పించి మరో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు గొంతెత్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి... పంత్ ఆటను మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవంటూ హెచ్చరించాడు.

శాస్త్రి మాట్లాడుతూ
శాస్త్రి మాట్లాడుతూ "ట్రినిడాడ్ మ్యాచ్‌లో తొలి బంతికే అతడు ఔటైన తీరు మళ్లీ రిపీట్ అయితే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. విండీస్‌తో జరిగిన మూడో వన్డేను చూడండి. తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఈ తరహా షాట్లు పదే పదే పునరావృతం చేస్తే అతనికి ఉద్వాసన తప్పదు. ఇక్కడ టాలెంట్ ఉందా.. లేదా అనేది ముఖ్యం కాదు" అని శాస్త్రి పేర్కొన్నాడు.

పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ కొనసాగిస్తే
"పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ కొనసాగిస్తే జట్టు విజయాల్లో భాగం అవుతాడు. ఇక పంత్ తనని తాను నిరూపించుకోవడంపై దృష్టి సారించాలి. టార్గెట్‌ను చేధించే క్రమంలో మరొక ఎండ్‌లో కెప్టెన్ ఉన్న పరిస్థితిలో సరైన క్రికెట్ అవసరం. అతని శైలిని మార్చడం గురించి కూడా ఎవరూ ఆలోచించరు. విరాట్ చెప్పినట్లుగా, పరిస్థితిని అర్ధం చేసుకోవడం, మ్యాచ్ అవగాహన మరియు షాట్-ఎంపిక చాలా కీలకం" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు .

అది గ్రహిస్తే అతడిని ఎవరూ ఆపలేరు
"అతడు దానిని గ్రహించగలిగితే, అతడిని ఎవరూ ఆపలేరు. ఒక గేమ్‌లో కనుక అతడు రాణిస్తే.. నాలుగు గేముల్లో రాణిస్తాడు. అతడు చాలా ఐపిఎల్ క్రికెట్ ఆడాడు.. తప్పక నేర్చుకుంటాడు. దశలవారీగా పంత్ ఎంత వినాశకరమైన క్రికెటరో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది" అని రవిశాస్త్రి వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications