బఠానీల కంటే తక్కువ: జీతాలపై రవిశాస్త్రి మండిపాటు
హైదరాబాద్: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలో ఉన్న క్రికెటర్లకు చెల్లిస్తున్న వార్షిక వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అన్నాడు. ఆటగాళ్లకు ఇచ్చే రూ. 2 కోట్లు బఠానీల కంటే తక్కువ అంటూ రవిశాస్త్రి ఎద్దేవా చేశాడు. బోర్డు పెంచిన వేతనాలు ఏదో విదిలించినట్టుగా ఉందని శాస్త్రి కామెంట్ చేశాడు.
భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లకు చాలా పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నారని అన్నాడు. గ్రేడ్ 'ఏ' ఆటగాళ్లకు రూ. 2 కోట్లు కాకుండా మరింత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌కు ఎంపికైన ఆటగాళ్ల వేతనాలను గత నెలలో బోర్డు డబుల్ చేసిన సంగతి తెలిసిందే.

బోర్డు ఇస్తున్న మొత్తం ఏ మాత్రం సరిపోదు
గ్రేడ్-ఎ ఆటగాళ్లకు రూ. 2 కోట్లు, గ్రేడ్-బి ప్లేయర్లకు రూ. 1 కోటి, గ్రేడ్-సి వాళ్లకు రూ. 50 లక్షలు చొప్పున బీసీసీఐ వార్షిక వేతనంగా చెల్లిస్తోంది. దీంతో పాటు మ్యాచ్ ఫీజుల కింద టెస్టుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు ఇస్తోంది. అయితే బీసీసీఐ ఇస్తున్న ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని శాస్త్రి పేర్కొన్నాడు.

పూజారాను ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడంపై
ఇక ఛటేశ్వర్ పూజారాను ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడంపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. ఐపీఎల్‌లాంటి టోర్నీల్లో ఆడకపోయినా పుజారా లాంటి ఆటగాళ్లు బాధపడరని అన్నాడు. టెస్టు టాప్ ప్లేయర్లకు గ్రేడ్-ఎ కాంట్రాక్టు కింద భారీ మొత్తంలో చెల్లించాలని బోర్డుకు సూచించాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా వేతనాలిలా ఉన్నాయి
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కింద మొత్తం 20 మంది ఆటగాళ్లు ఉండగా, కెప్టెన్ స్మిత్ ఏడాదికి రూ. 5.53 కోట్లు అందుకుంటున్నాడని, మిగతా 19 మందికి రూ. 4.45 కోట్ల చొప్పున సీఏ చెల్లిస్తోందని శాస్త్రి తెలిపాడు. ఐసీసీ టోర్నీలు పెరుగుతున్న నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేయాలని అన్నాడు.

ఆసక్తిని చాంపియన్స్ ట్రోఫీ తగ్గిస్తుంది
వరల్డ్ కప్‌పై ఆసక్తిని చాంపియన్స్ ట్రోఫీ తగ్గిస్తుందని అన్నాడు. ‘వరల్డ్‌కప్, టీ20, టెస్టు క్రికెట్ వరకు ఫర్వాలేదు. చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సిన అవసరమేముంది' అని రవిశాస్త్రి ఐసీసీని ప్రశ్నించాడు. ఈ టోర్నీ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరని, వరల్డ్ కప్ విజేతలు అంటే ఠక్కున గుర్తొస్తారని, మరి చాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది ఎవరంటే చెప్పడం కష్టమని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications