బౌలింగ్ కోచ్‌పై కొత్త డ్రామా: తెరపైకి భరత్ అరుణ్, మరి జహీర్ ఏం చేస్తాడో?
హైదరాబాద్: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పేరుని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనిల్ కుంబ్లే వారసుడిగా రవిశాస్త్రి 2019 వరల్డ్ కప్ వరకు ప్రధాన కోచ్‌గా సేవలందించనున్నాడు.
అయితే కొత్త కోచ్ ఎవరన్న సందిగ్ధత వీడటంతో ఇప్పుడు బౌలింగ్ కోచ్‌పై కొత్త డ్రామా మొదలైంది. అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేయమని సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి చెబితే వాళ్లేమో బౌలింగ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కన్సల్టెంట్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే.

బౌలింగ్ కోచ్‌గా తెరపైకి భరత్ అరుణ్
ఇప్పుడు కొత్త కోచ్ రవిశాస్త్రి మాత్రం తాను చెప్పిన బౌలింగ్ కోచ్‌నే నియమించాలని పట్టుబడుతున్నాడు. నిజానికి కొత్తగా నియమితులైన కోచ్ తనకు నచ్చిన సపోర్టింగ్ స్టాఫ్‌ని ఎంపిక చేసుకునే హక్కు ఉంది. గతంలో భారత జట్టుకు కోచ్‌లుగా పనిచేసిన డంకన్ ఫ్లెచర్, గ్యారీ కిరెస్టన్‌లు ఇలాగే చేశారు. అయితే రవిశాస్త్రి విషయంలో మాత్రం అలా జరగలేదు.

రవిశాస్త్రిని అడగకుండానే సీఏసీ
మొదటి నుంచీ భరత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా కావాలని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ, సీఏసీ మాత్రం జహీర్‌ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. రవిశాస్త్రిని అడగకుండానే సీఏసీ జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్‌లను నియమించింది. వాళ్ళిద్దరితో తనకు ఎటువంటి ఇబ్బంది లేకున్నా, తనతో ఎప్పటికీ కలిసి పనిచేసే వ్యక్తి బౌలింగ్ కోచ్‌గా కావాలని రవిశాస్త్రి ఇప్పుడు పట్టుబడుతున్నాడు.

జట్టు వెంట ఎప్పటికీ ఓ బౌలింగ్ కోచ్
జహీర్ ఖాన్ అనుభవం కలిగిన బౌలర్ అని, అతని సలహాలు, సూచనల వల్ల జట్టు బౌలింగ్ మెరుగవుతుందని రవిశాస్త్రి చెబుతుండటం విశేషం. అయినప్పటికీ జహీర్ ఖాన్ సలహాలు అమలు చేయాడనికి ఎప్పటికీ జట్టు వెంట భరత్ లాంటి కోచ్ ఉంటే ఇంకా బాగుంటుందని రవిశాస్త్రి అంటున్నాడు. ఈ విషయమై బీసీసీఐ పరిపాలనా కమిటీని వచ్చే సోమవారం రవిశాస్త్రి కలవనున్నాడని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన రవిశాస్త్రి
జహీర్ ఖాన్ ఏడాదిలో వంద రోజుల కంటే ఎక్కువ సమయం జట్టుతో ఉండే వీలు లేకపోవడంతో పూర్తిస్థాయి బౌలింగ్ కోచ్ అన్న మరో వాదనను రవిశాస్త్రి తాజాగా తెరపైకి తీసుకొచ్చాడని అంటున్నారు. 2014లో రవిశాస్త్రి టీమ్ డైరెక్టర్ అయిన సమయంలో అప్పటి ఆస్ట్రేలియన్ జో దాస్ స్ధానంలో భరత్ అరుణ్‌ను తీసుకొచ్చాడు.

మంచి స్నేహితులు
2016లో రవిశాస్త్రి స్ధానంలో కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపికయ్యే వరకు అరుణ్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రవిశాస్త్రి, భరత్ అరుణ్ అండర్ 19 క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి మంచి స్నేహితులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications